- Telugu News Photo Gallery Cinema photos Do you remember the child in this photo? She is Raj Tarun heroine Malvi Malhotra
ఒక్క సినిమా కూడా చేయకుండానే టాలీవుడ్‌లో రచ్చ రచ్చ చేస్తుంది ఈ అమ్మడు.. ఎవరో తెలుసా
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కొత్త అందాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సినిమా సినిమాకు కొత్త కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ముద్దుగుమ్మలు ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు.
Updated on: Jul 06, 2024 | 2:14 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కొత్త అందాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సినిమా సినిమాకు కొత్త కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ముద్దుగుమ్మలు ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు.

ఇక పై ఫొటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా ఇప్పుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అయితే ఈ చిన్నది ఇంకా తెలుగు సినిమాలో నటించలేదు కానీ.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమె పేరే వినిపిస్తుంది.

ఆమె పేరు మాల్వి మల్హోత్రా ఈ చిన్నది మోడలింగ్ నుంచి హీరోయిన్ గా మారింది. హిందీలో పలు హిందీలో పలు సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్, ఓటీటీ సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది.

రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న తిరగబడరా సామి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెడుతుంది ఈ చిన్నది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. కానీ ఇప్పుడు ఊహించని విధంగా చిక్కుల్లో పడింది . లావణ్య అనే యువతీ తాజాగా రాజ్ తరుణ్ పై కేసు వేసింది.

తనను ప్రేమించి మోసం చేశాడని.. ఇప్పుడు రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాతో రిలేషన్ లో ఉన్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో ఇప్పుడు ఈ అమ్మడి పేరు హాట్ టాపిక్ గా మారింది. ఈమె గురించి గూగుల్ లో తెగ గాలిస్తున్నారు నెటిజన్స్.




