- Telugu News Photo Gallery Cinema photos Do you Know Nandamuri Taraka Ratna and his wife Alekhya Reddy love story: here's full details
Nandamuri Taraka Ratna: నందమూరి తారకరత్న లవ్‌స్టోరీ.. పెద్దలను ఎదిరించి గుళ్లో పెళ్లి.. అసలు ట్విస్ట్ ఇదే..
కేవలం 39 ఏళ్లకే హార్ట్ ఎటాక్‌తో నందమూరి తారకరత్న శనివారం రాత్రి (ఫిబ్రవరి 18) మృత్యు ఒడికి చేరుకున్నారు. దీంతో యావత్ తెలుగు సినీ ప్రపంచం దుఃఖ సాగరంలో మునిగిపోయింది...
Updated on: Feb 19, 2023 | 4:12 PM

కేవలం 39 ఏళ్లకే హార్ట్ ఎటాక్‌తో నందమూరి తారకరత్న శనివారం రాత్రి (ఫిబ్రవరి 18) మృత్యు ఒడికి చేరుకున్నారు. దీంతో యావత్ తెలుగు సినీ ప్రపంచం దుఃఖ సాగరంలో మునిగిపోయింది.

ఎన్టీఆర్ మనవడు, నందమూరి మోహనకృష్ణ తనయుడైన తారకరత్న 20 ఏళ్ల వయసులోనే ఒకటో నెంబర్ కుర్రాడు మువీతో సీని రంగంలోకి అరంగేట్రం చేశారు

ఆ తర్వాత స్నేహితుల ద్వారా సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్న అలేఖ్యరెడ్డి పరిచయమైంది. తారక్ నందీశ్వరుడు సినిమాకు అలేఖ్య కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసని సమయంలో వీరి పరిచయం ప్రేమకు దారితీసింది.

ఇది వరకే పెళ్లై విడాకులు తీసుకున్న అలేఖ్యను వివాహం చేసుకోవడానికి తారక్ ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. పెద్దలను ఎదిరించి 2012లో ఓ గుడిలో అలేఖ్యను వివాహం చేసుకున్నారు.

వివాహం తర్వాత కొంతకాలానికి ఇరు కుటుంబా పెద్దలు వీరి వివాహాన్ని అనుమతించారు. ఈ జంటకు 2013లో నిషిక అనే కూతురు జన్మించింది. రాజకీయాల్లో అడుగుపెట్టి ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టీడీపీతో కలిసి అడుగులు వేస్తున్న తరుణంలో తన కోరిక తీరకుండానే తారక్ అనంతలోకాలకు చేరుకున్నాడు.




