- Telugu News Photo Gallery Cinema photos Do you know heroine who only got 4 hits from 12 films in Telugu, she is Hebah Patel
కవ్వించే అందం.. కానీ కలిసిరాని కాలం..! 12 సినిమాలు చేస్తే 4 మాత్రమే హిట్స్
చాలా మంది ముద్దుగుమ్మలు తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మంచి సినిమా పడితే స్టార్స్ గా మారిపోవాలని హీరోయిన్స్ ప్రయత్నిస్తున్నారు. దాంతో మంచి ఛాన్స్ దొరికితే తమ టాలెంట్ మొత్తం చూపించడానికి, అలాగే ఎలాంటి సాహసమైన చేయడానికి హీరోయిన్స్ రెడీ అవుతున్నారు.
Updated on: Jul 15, 2025 | 1:18 PM

చాలా మంది ముద్దుగుమ్మలు తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మంచి సినిమా పడితే స్టార్స్ గా మారిపోవాలని హీరోయిన్స్ ప్రయత్నిస్తున్నారు. దాంతో మంచి ఛాన్స్ దొరికితే తమ టాలెంట్ మొత్తం చూపించడానికి, అలాగే ఎలాంటి సాహసమైన చేయడానికి హీరోయిన్స్ రెడీ అవుతున్నారు.

అయితే కొంతమంది ముద్దుగుమ్మలు కొన్ని సినిమాలతోనే పరిమితం అవుతున్నారు. వరుసగా సినిమాలు చేసి ఆ తర్వాత అవకాశాలు లేక సోషల్ మీడియాతోనే గడిపేస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు. ఈ చిన్నది చేసింది 12 సినిమాలు కానీ హిట్స్ మాత్రంనాలుగు మాత్రమే..

అవకాశాలు లేక తన గ్లామర్ తో దర్శక నిర్మాతలను ఆకర్షిస్తున్న ఈ అమ్మడు ఎవరో కాదు.. తెలుగులో చేసిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. తన అందం, అభినయంతో కట్టిపడేసింది. కానీ ఆతర్వాత అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. వరుసగా సినిమాలు చేసినప్పటికీ అంతగా హిట్స్ అందుకోలేదు.

ఆమె ఎవరో కాదు అందాల భామ హెబ్బా పటేల్.. అలా ఎలా సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది హెబ్బా.. ఆతర్వాత కుమారి 21 ఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది అందాల భామ హెబ్బా పటేల్. సుకుమార్ రైటింగ్స్ పై తెరకెక్కిన ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

తర్వాత వరుసగా సినిమాలు చేసిన అదృష్టం కలిసి రాలేదు. స్పెషల్ సాంగ్స్ చేసిన అంతగా గుర్తింపు రాలేదు. ఇటీవలే ఓదెల 2సినిమాలో మెరిసింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హెబ్బా పటేల్ తన అందంతో కుర్రకారును కట్టిపడేస్తుంది. క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది ఈ అమ్మడు.




