- Telugu News Photo Gallery Cinema photos Do you know who this heroine gave a short break to films, She is Kavya Kalyan Ram
అప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు.. ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూపులు
టాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది యంగ్ బ్యూటీలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ కుర్ర భామలు దూసుకుపోతున్నారు. చిన్న సినిమాలతోనే సూపర్ హిట్స్ అందుకుంటూ అవకాశాలు అందుకుంటున్నారు. ఒక్క సినిమా రిలీజ్ అవ్వగానే మినిమమ్ మూడు సినిమాలను లైనప్ చేస్తున్నారు.
Updated on: Jul 15, 2025 | 1:27 PM

టాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది యంగ్ బ్యూటీలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ కుర్ర భామలు దూసుకుపోతున్నారు. చిన్న సినిమాలతోనే సూపర్ హిట్స్ అందుకుంటూ అవకాశాలు అందుకుంటున్నారు. ఒక్క సినిమా రిలీజ్ అవ్వగానే మినిమమ్ మూడు సినిమాలను లైనప్ చేస్తున్నారు.

కానీ ఈ అమ్మడు మాత్రం అలా కాదు.. హీరోయిన్ గా మూడు సినిమాలు చేసింది. వాటిలో రెండు సూపర్ హిట్స్.. ఒకటి డిజాస్టర్. మొదటి రెండు సినిమాలు హిట్ అవ్వగానే ఈ అమ్మడు పేరు ఇండస్ట్రీలో గట్టిగా వినిపించింది. ఇక ఒక్క సినిమా డిజాస్టర్ అవ్వగానే సినిమాలకు గ్యాప్ తీసుకుంది

అయితే ఆమె నిజంగానే గ్యాప్ తీసుకుందా లేక అవకాశాలు రావడంలేదా అని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ ఆ అమ్మడు ఎవరో తెలుసా.? తెలుగులో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు తమ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పదుల సంఖ్యలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసి ఇప్పుడు హీరో, హీరోయిన్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు.

వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు.. ఆమె కావ్య కళ్యాణ్ రామ్. ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. గంగోత్రి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది. మసూద సినిమాతో హీరోయిన్ గా మారింది కావ్య కళ్యాణ్ రామ్. తొలి సినిమాతోనే హీరోయిన్ గా ఆకట్టుకుంది. తన నటనతో మెప్పించింది ఈ చిన్నది. ఆతర్వాత వేణు దర్శకత్వంలో బలగం సినిమాలో నటించింది. బలగం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కానీ ఆతర్వాత ఆమె హీరోయిన్ గా చేసిన ఉస్తాద్ సినిమా డిజాస్టర్ అయ్యింది. శ్రీ సింహ హీరోగా నటించిన ఈ సినిమా తర్వాత కావ్య సినిమాలకు గ్యాప్ తీసుకుంది. సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడుపుతుంది. 2023లో వచ్చిన ఉస్తాద్ సినిమా తర్వాత కావ్య కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన అందాలతో ప్రేక్షకులను కవ్విస్తుంది కావ్య.




