- Telugu News Photo Gallery Cinema photos Director shankar shocking decision on ram charan game changer
Shankar: ఫుల్ ఫోకస్ గేమ్ చేంజర్ మీదే.. శంకర్ నయా డెసిషన్
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ బటర్‌ఫ్లై ఎఫెక్ట్ కనిపిస్తూనే ఉంటుంది. ఎక్కడో ఓ సినిమా హిట్ అయితే దాని తలూకు ఇంపాక్ట్ ఇప్పుడు సెట్స్ మీదున్న ఇంకో సినిమాపై కనిపిస్తుంది. అలాంటిది సేమ్ డైరక్టర్ హ్యాండిల్ చేసిన ప్రాజెక్టులు వరుసబెట్టి రిలీజ్‌కి రెడీ అవుతుంటే, ప్రభావం లేకుండా ఉంటుందా చెప్పండి.... కచ్చితంగా ఉంటుంది కదా అంటారా?.. ఇలా అంటారని తెలిసే శంకర్ అలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఏంటది?
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Jul 19, 2024 | 7:35 PM

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ బటర్‌ఫ్లై ఎఫెక్ట్ కనిపిస్తూనే ఉంటుంది. ఎక్కడో ఓ సినిమా హిట్ అయితే దాని తలూకు ఇంపాక్ట్ ఇప్పుడు సెట్స్ మీదున్న ఇంకో సినిమాపై కనిపిస్తుంది. అలాంటిది సేమ్ డైరక్టర్ హ్యాండిల్ చేసిన ప్రాజెక్టులు వరుసబెట్టి రిలీజ్‌కి రెడీ అవుతుంటే, ప్రభావం లేకుండా ఉంటుందా చెప్పండి.... కచ్చితంగా ఉంటుంది కదా అంటారా?.. ఇలా అంటారని తెలిసే శంకర్ అలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఏంటది?

టెక్నాలజీ పెద్దగా లేని రోజుల్లోనే భారతీయుడు సినిమాతో ఇరగదీశారు శంకర్. అలాంటిది ఇప్పుడు ఎక్స్ పీరియన్స్, బడ్జెట్, టెక్నాలజీ.. ఇన్నీ ఉన్నప్పుడు ఇంకే రేంజ్లో బొంబాట్ చేస్తారో అంటూ ఇండియన్2 కోసం ఆత్రుతగా ఎదురుచూశారు జనాలు. అయితే అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి. ఇండియన్ 2 మార్నింగ్ షోతోనే బ్యాడ్ టాక్ తెచ్చేసుకుంది.

నవంబర్ రెండో వారం నాటికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి.. నెల రోజులు ప్రమోషన్‌కే కేటాయించాలని చూస్తున్నారు మేకర్స్. సెప్టెంబర్ చివరి వారంలో మరో పాటను విడుదల చేయనున్నారు. అక్టోబర్ నుంచి ప్రమోషన్స్ జోరు మరింత పెరగనుంది.

ఈ విషయం శంకర్ చెవిన కూడా పడ్డట్టుంది. ఇక ఎటూ చూసేది లేదు... లేజర్ పాయింట్ ఫోకస్ మొత్తం గేమ్ చేంజర్ మీదేనని ఫిక్సయ్యారు. ఆల్రెడీ చెర్రీ పార్ట్ షూట్ కంప్లీట్ అయింది. ఓవరాల్‌గా మిగిలిన 20 రోజుల షెడ్యూల్‌ని కూడా ప్లాన్ చేస్తున్నారు. గుమ్మడికాయ కొట్టగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులను దగ్గరుండి చూసుకోవాలని ఫిక్సయ్యారట శంకర్.

గేమ్ చేంజర్ హిట్ అయితేనే శంకర్ ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద ఆడియన్స్ కి కాస్తయినా నమ్మకం కుదురుతుంది. లేకుంటే గత కొన్నాళ్లుగా ఫ్లాపుల్లో ఆయన ఆయన కెరీర్‌ని లంగరేసి లాగినా ఒడ్డుకు తీసుకురావడం కష్టమేనని అంటున్నారు క్రిటిక్స్.