- Telugu News Photo Gallery Cinema photos Telugu audience expect big budget movies to release early in ott platforms like Kalki 2898 AD, Animal Telugu Heroes Photos
Animal Vs Kalki 2898 AD: రచ్చ షురూ.? కల్కి vs యానిమల్.. కొన్నిసార్లు రూల్స్ బ్రేక్.
సినిమా థియేటర్లలోకి వచ్చే రోజు కోసం జనాలు ఈగర్‌గా వెయిట్ చేసే రోజులు రాను రాను తగ్గుతున్నాయి. సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేసే వారు కొందరైతే, ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేసే వర్గం కూడా క్రియేట్ అవుతోంది. ఓటీటీ రిలీజ్ అన్నది సినిమా జయాపజయాల మీద ఎక్కువగా ఆధారపడుతుందన్నది నిదానంగా అర్థమవుతున్న విషయం. కల్కి లాంటి సినిమాను స్మాల్ స్క్రీన్ మీద కాదు, బిగ్ స్క్రీన్స్ మీద ఎంజాయ్ చేయండి అని పదే పదే చెప్పారు మేకర్స్.
Updated on: Jul 19, 2024 | 2:53 PM

సినిమా థియేటర్లలోకి వచ్చే రోజు కోసం జనాలు ఈగర్‌గా వెయిట్ చేసే రోజులు రాను రాను తగ్గుతున్నాయి. సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేసే వారు కొందరైతే, ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేసే వర్గం కూడా క్రియేట్ అవుతోంది. ఓటీటీ రిలీజ్ అన్నది సినిమా జయాపజయాల మీద ఎక్కువగా ఆధారపడుతుందన్నది నిదానంగా అర్థమవుతున్న విషయం.

సినిమా థియేటర్లలోకి వచ్చే రోజు కోసం జనాలు ఈగర్‌గా వెయిట్ చేసే రోజులు రాను రాను తగ్గుతున్నాయి. సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేసే వారు కొందరైతే, ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేసే వర్గం కూడా క్రియేట్ అవుతోంది. ఓటీటీ రిలీజ్ అన్నది సినిమా జయాపజయాల మీద ఎక్కువగా ఆధారపడుతుందన్నది నిదానంగా అర్థమవుతున్న విషయం.

యానిమల్ సినిమా టైమ్‌లోనూ ఓటీటీ రిలీజ్ ప్రస్తావన బలంగా వినిపించింది. ఇలాంటి సినిమాలను ఇంట్లో అందరి ముందు ఎలా చూడడం అన్నవారూ లేకపోలేదు.

అయినా హిట్ మూవీ కావడంతో ఆలస్యంగానే ఓటీటీలో విడుదలైంది. థియేటర్లలో వచ్చినప్పుడు ఎంత మంది సినిమా గురించి స్పందించారో, ఓటీటీలో విడుదలయ్యాక అంతకన్నా ఎక్కువ మంది స్పందించారు.

పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాలు కూడా స్క్రీన్ మీద సత్తా చాటుకుంటే ఓటీటీ సంస్థలు కాసింత ఓపిగ్గానే వ్యవహరిస్తున్నాయి. ఎనిమిదంటే, ఎనిమిది వారాల్లోనే ఓటీటీ రిలీజ్ చేసేస్తామని అనడం లేదు. థియేటర్లలో రన్‌ని గౌరవిస్తున్నాయి.

మామూలుగా ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలు, పెద్ద పెద్ద దర్శకులు, స్టార్ హీరోల సినిమాలకు ఓటీటీల సహకారం మెండుగానే ఉంటోంది.

కాకపోతే సినిమా రిలీజ్‌కి ముందు చేసుకున్న డీల్‌ని బట్టి చాలా వరకు కండిషన్స్ అప్లై అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో పరస్పరం మాట్లాడుకుని రీ కన్సిడర్ చేసుకోవడాన్ని కూడా గమనిస్తూనే ఉన్నాం.




