- Telugu News Photo Gallery Cinema photos Deepika Padukone's Career Dilemma Sandeep Reddy Vanga Controversy and Film Offers
Deepika Padukone: వంగా ఎఫెక్ట్.. కల్కి ట్వీట్.. దీపిక ఔట్..
సందీప్ రెడ్డి వంగాతో వివాదం తర్వాత దీపిక పదుకొనే కెరీర్ డైలమాలో పడిందా..? బాలీవుడ్‌లో ఎన్నో ఏళ్లుగా దీపిక కట్టుకున్న సామ్రాజ్యం.. వంగా వైరంతో బీటలు బారిందా..? దీపికను అప్రోచ్ అవ్వడానికి దర్శకులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారా..? కల్కి 2 నుంచి దీపికను తప్పించడానికి కారణమేంటి..? ఈమెకు వర్క్ మీద కమిట్‌మెంట్ లేదా..?
Updated on: Sep 19, 2025 | 9:16 PM

దీపిక పదుకొనే.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. కానీ ఈమెను ఆ మధ్య మరో రకంగా ప్రపంచానికి పరిచయం చేసారు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.

ఒకే ఒక్క ట్వీట్‌తో దీపిక కెరీర్ తలకిందులైంది. స్పిరిట్ నుంచి దీపికను తీసేసి.. త్రిప్తి దిమ్రిని తీసుకున్నారు సందీప్. అక్కడితో ఆగకుండా కథ లీక్ చేస్తుందంటూ దీపికపై ట్వీట్ చేసారు వంగా.

రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే లే అంటుంటారు దీపిక పదుకొనే. స్పిరిట్ విషయంలోనూ ఇదే గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. 20 కోట్లతో పాటు.. ఇష్టమొచ్చిన కండీషన్స్ పెట్టేసరికి.. ఈమెనే పక్కనబెట్టారు వంగా.

ఇప్పుడు కల్కి 2 టీం కూడా తమ సినిమా నుంచి దీపిక పదుకొనేను తప్పించినట్లు తెలిపింది. కల్కి లాంటి సినిమాలు చేయాలంటే కమిట్‌మెంట్ ఎక్కువగా ఉండాలని ట్వీట్ చేసింది వైజయంతి మూవీస్.

ఈ లెక్కన వర్క్‌పై దీపికకు శ్రద్ధ లేదని ఇన్ డైరెక్టుగా చెప్పారు కల్కి మేకర్స్. పైకి సాఫ్ట్‌గా ట్వీట్ చేసారు కానీ.. ఈ ట్వీట్ వెనక ఎన్ని విభేదాలు వచ్చుంటాయో అర్థమైపోతుంది. కల్కి, స్పిరిట్ నుంచి తప్పించినా.. దీపిక చేతిలో ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా ఉంది.




