Film News: సోషల్‌ డ్రామాగా కుబేర.. పుష్ప2 పాటతో రీల్స్ ట్రెండ్..

ధనుష్‌, నాగార్జున కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా కుబేర. రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న సినిమా గేమ్‌ చేంజర్‌. 1947లో లాహోర్‌లో జరిగిన ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 'లాహోర్‌: 1947'. శ్రీవిష్ణు హీరోగా హసిత్‌ గోలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా స్వాగ్‌. అల్లు అర్జున్‌, రష్మిక మందన్న నటిస్తున్న సినిమా పుష్ప2.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Prudvi Battula

Updated on: Jun 05, 2024 | 12:19 PM

ధనుష్‌, నాగార్జున కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా కుబేర. ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ హైదరాబాద్‌లో మొదలైంది. ఈ షెడ్యూల్‌ కోసం స్పెషల్‌ సెట్‌ వేశారు మేకర్స్. ఈ సెట్లోనే భారీ యాక్షన్‌ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారు. సోషల్‌ డ్రామాగా తెరకెక్కుతోంది కుబేర. ధనుష్‌, నాగార్జున పాత్రలను శేఖర్‌ కమ్ముల సరికొత్తగా తీర్చిదిద్దారట.

1 / 5
రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న సినిమా గేమ్‌ చేంజర్‌. ఈ చిత్రం నయా షెడ్యూల్‌ ఈ వారంలో రాజమండ్రిలో మొదలవుతుంది. దాదాపు వారం రోజుల పాటు ఈ షెడ్యూల్‌ ఉంటుంది. దీంతో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని సమాచారం. పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతోంది గేమ్‌ చేంజర్‌. అక్టోబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

2 / 5
1947లో లాహోర్‌లో జరిగిన ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 'లాహోర్‌: 1947'. ప్రీతి జింటా కీలక పాత్రలో నటించారు. తన జీవితంలో ఇప్పటిదాకా చేసిన పాత్రల్లో అత్యంత కష్టమైన సినిమా ఇదేనని అన్నారు ప్రీతి. తన రీ ఎంట్రీ కోసం వెయిట్‌ చేస్తున్న అభిమానులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని చెప్పారు.

3 / 5
శ్రీవిష్ణు హీరోగా హసిత్‌ గోలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా స్వాగ్‌. పీపుల్‌ మీడియా సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మీరా జాస్మిన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో ఆమె.. రాణి ఉత్పల దేవిగా నటిస్తున్నారని ప్రకటించారు.

4 / 5
అల్లు అర్జున్‌, రష్మిక మందన్న నటిస్తున్న సినిమా పుష్ప2. ఈ సినిమా నుంచి ఇటీవల కపుల్‌ సాంగ్‌ విడుదలైంది. ఈ పాటకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షకు పైగా రీల్స్ వచ్చాయి. దీన్ని బట్టి పుష్ప సీక్వెల్‌ కోసం ఆడియన్స్ ఎంతలా ఎదురుచూస్తున్నారో అర్థమవుతోందని అంటున్నారు మేకర్స్. ఆగస్టు 15న విడుదల కానుంది పుష్ప2.

5 / 5
Follow us