బుజ్జి ఈవెంట్ నుంచి కల్కి జోరు పెరిగింది. బుజ్జి రావడం.. ఆ తర్వాత బుజ్జి యానిమేషన్ సిరీస్ అన్నీ ఫాస్టుగా జరిగిపోతున్నాయ్. తాజాగా యానిమేషన్ సిరీస్ విడుదల చేసారు మేకర్స్. ఇది నిజంగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్. బుజ్జి, భైరవ రిలేషన్, బాండింగ్‌పై ఇలాంటి ఓ సిరీస్ వస్తుందనే విషయం ప్రభాస్ అభిమానులకు కూడా తెలియదు. సడన్‌గా ట్రైలర్ రిలీజ్ చేసి షాకిచ్చారు నాగ్ అశ్విన్. రెండు ఎపిసోడ్లుగా మే 31 నుంచి ఈ సిరీస్ ప్రసారం అవుతుంది. ఇది భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది.