Tollywood: అప్పుడు హోమ్లీగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. కుర్రాళ్లకు ఇష్టమైన ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ?
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో తెగ వైరలవుతుంది. దక్షిణాదిలోని అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. టీనేజ్ లోనే కథానాయికగా అరంగేట్రం చేసిన ఈ చిన్నది.. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

Anupama
- పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ? ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అందరి ఇష్టమైన హీరోయిన్. ముఖ్యంగా కుర్రాళ్లకు నచ్చిన ముద్దుగుమ్మ. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?
- ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ‘అలువపుళయుదే తీరత్’ పాట పాడటం ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ప్రేమమ్ సినిమాతో టీనేజ్ వయసులోనే నటిగా తెరంగేట్రం చేసింది. ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది.
- త్రిస్సూర్ జిల్లాలోని ఇరింజలకుడలో జన్మించిన అనుపమ చిన్ననాటి కల సినీ నటి కావడమే. చిన్న వయసులోనే ఆడిషన్లో పాల్గొనడం ద్వారా ‘ప్రేమమ్’ చిత్రంలో నటించే అవకాశాన్ని పొందింది. ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో అధికంగా ఆఫర్స్ వచ్చాయి. దీంతో తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారిపోయింది.
- ఆ ఆ, శతమానం భవతి, కృష్ణార్జున యుద్ధం వంటి చిత్రాల ద్వారా అనుపమ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. అయితే ఇన్నాళ్లు సినిమాల్లో హోమ్లీగా కనిపించిన అనుపమ.. ఇప్పుడు మాత్రం గ్లామర్ షోలతో రచ్చ చేస్తుంది. టిల్లు స్క్వేర్ సినిమాతో ఆమె గ్లామర్ లుక్స్ తో మెంటలెక్కించింది.
- అనుపమ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 50 లక్షల నుంచి 2 కోట్ల వరకు తీసుకుంటుంది. టిల్లు స్క్వేర్ విజయం తర్వాత అనుపమ తన పారితోషికాన్ని పెంచిందని టాక్. ఇప్పుడు ఒక్కో సినిమాకు దాదాపు కోటి రూపాయలు తీసుకుంటుందట. అంతేకాదు.. నివేదిక ప్రకారం ఆమె ఆస్తులు రూ.33 కోట్లు.









