- Telugu News Photo Gallery Cinema photos Actress Mamta Mohandas Feeling Regret For Acting in Rajinikanth Movie, Know The Reason
Rajinikanth : రజినీకాంత్ సినిమాలో నటించి తప్పు చేశాను.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో చిన్న పాత్రలలో నటించే ఛాన్స్ వచ్చినా చాలు అనుకుంటారు కొందరు హీరోయిన్స్. ఇక మరికొందరు మాత్రం స్టార్స్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసేందుకు కూడా వెనకడుగు వేయరు. కానీ ఓహీరోయిన్ మాత్రం సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాల్లో నటించి తప్పు చేశాను అంటుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?
Updated on: Jul 17, 2025 | 9:12 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి తెలిసింది. ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు ఏడు పదుల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కుర్రహీరోలకు పోటీనిస్తున్నారు.

ప్రస్తుతం డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాతోపాటు త్వరలోనే జైలర్ 2 సినిమా సైతం స్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం బ్యాక టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే రజినీ సినిమాలో నటించి తప్పు చేశానంటుంది ఓ హీరోయిన్.

ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ మమతా మోహన్ దాస్. తెలుగులో యమదొంగ సినిమాతో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ ఈ బ్యూటీకి అంతగా గుర్తింపు మాత్రం రాలేదు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న మమతా మోహన్ దాస్.. ఇటీవలే మహారాజా సినిమాతో మరోసారి వెండితెరపై సందడి చేసింది.

అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మమతా మోహన్ దాస్.. కొనని సినిమాలను తాను చేయకుండా ఉండి ఉంటే బాగుండేది అని తెలిపింది. అందులో ఒకటి ఖచ్చితంగా రజినీకాంత్ నటించిన కుసేలన్ (కథానాయకుడు) మూవీ అని తెలిపింది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.

అయితే ఈ సినిమాలో ఆమెపై రెండు రోజులపాటు షూటింగ్ చేశారట. చివరకు ఎడిటింగ్ లో ఆమె పార్ట్ మొత్తం తీసేసి కేవలం కొన్ని సెకన్లు మాత్రమే చూపించారట. ఆ విషయం తనకు బాధ కలిగించిందని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో ఒక్క నిమిషం కూడా ఆన్ స్క్రీన్ లేకపోవడంతో నచ్చలేదని.. అందుకే ఆ సినిమాలో నటించి తప్పు చేశానంటుంది మమతా.




