AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దెయ్యాలకు పుట్టిల్లుగా బాలీవుడ్.. అవి మా దత్త పుత్రికలు అంటున్న మేకర్స్

దెయ్యం అంటే అంతా భయపడుతుంటారు కానీ బాలీవుడ్ మేకర్స్ మాత్రం రా రమ్మంటూ ఆహ్వానిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే దెయ్యాలను వాళ్లు దత్త పుత్రికల్లా చూసుకుంటున్నారు. ఈ దెయ్యాల సినిమాలకు ఉన్న క్రేజ్ చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది. ఇంట్లో కుక్కల్ని, పిల్లుల్ని పెంచుకున్నట్లు.. నార్త్ నిర్మాతలు దెయ్యాలను పెంచుకుంటున్నారు. మరి వాళ్ల కథేంటో చూద్దామా..?

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Phani CH|

Updated on: Apr 20, 2025 | 9:36 PM

Share
స్త్రీ 2 సినిమాకు ఏకంగా 700 కోట్లు రావడంతో.. బాలీవుడ్‌లో దెయ్యాల సినిమాలపై మరోసారి గిరాకీ పెరిగింది. అవసరం ఉన్నా లేకపోయినా.. ఓ దెయ్యం సినిమా తీస్తే సరిపోద్దిలే అనుకుంటున్నారు.

1 / 5
ఈ క్రమంలోనే తాజాగా ఫామ్‌లో లేని సంజయ్ దత్ కూడా భూతిని అంటూ డెవిల్ స్టోరీతో వచ్చేస్తున్నారు. మే 1న విడుదల కానుంది ఈ చిత్రం. తనకు హీరోగా మార్కెట్ లేదని తెలిసినా.. దెయ్యంపై నమ్మకంతో భూతిని చేస్తున్నారు సంజయ్ దత్.

2 / 5
సిద్ధాంత్ సచ్‌దేవ్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ పూర్తిగా దెయ్యాలకు పుట్టిల్లుగా మారిపోయింది. స్త్రీ 2, భూల్ భులయ్యా 3, ముంజియా లాంటి సినిమాలు కాసులు కురిపించడంతో.. అంతా అటు వైపు పరుగులు పెడుతున్నారు.

3 / 5
కాస్త భయపెట్టి నవ్విస్తే చాలు వందల కోట్లు ఇచ్చేస్తున్నారు ఆడియన్స్. అందుకే అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు మేకర్స్. మ్యాడాక్ ఫిల్మ్స్ అయితే.. రాబోయే మూడేళ్లలో తమ బ్యానర్ నుంచి ఏకంగా 8 హార్రర్ సినిమాలను తీసుకొస్తున్నారు.

4 / 5
 స్త్రీ 3, భేడియా 2, ముంజియా 2, పెహ్లా మహాయుధ్, దూస్రా మహాయుధ్, శక్తి షాలిని లాంటి సినిమాలు ఈ బ్యానర్ నుంచి రానున్నాయి.

5 / 5