Basha Shek |
Updated on: Feb 11, 2023 | 2:08 PM
ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ప్రేమ, రిలేషన్‌షిప్ వ్యవహారంలో ఈ ముద్దుగుమ్మ పేరు బాగా వినిపించింది.
ఇదిలా ఉంటే తాజాగా కాంతారా హీరో రిషబ్ శెట్టిని కలిసిందీ అందాల తార. ప్రస్తుతం వీరిద్దరి ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రస్తుతం 'కాంతారా 2' సినిమాపై విస్తృతంగా చర్చ సాగుతోంది. ఈ సినిమాలో రిషబ్‌తో కలిసి ఎవరు నటిస్తారు? అన్న ఆసక్తి నెలకొంది. ఈక్రమంలో ఊర్వశి షేర్ చేసిన ఫోటో వైరల్‌గా మారింది.
రిషబ్ శెట్టితో కలిసున్న ఫొటోను షేర్ చేస్తూ 'కాంతారా 2' లోడింగ్ అని క్యాప్షన్ ఇచ్చింది ఊర్వశి. తన పోస్టుకు రిషబ్, హోంబలే ఫిల్మ్స్‌లను ట్యాగ్ చేశాడు.
కాగా 'కాంతారా' చిత్రానికి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ఉంటుందని రిషబ్ శెట్టి ఇటీవలే ప్రకటించారు. దీంతో ఈ సినిమాలో ఎలాంటి కథ చెప్పబోతున్నాడు అన్న ఆసక్తి నెలకొంది. మొదటి పార్ట్‌లో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించింది.