- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss Telugu season 7, know about Subhashree, her background and what she studied
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ శుభ శ్రీ బ్యాగ్రౌండ్ తెలిస్తే అవాక్ అవ్వాల్సిందే
బిగ్ బాస్ సీజన్ 7 లో చాల మంది అందాల భామలు ఉన్నారు. వెళ్లిన 14 మందిలో శుభశ్రీ రాయగురు స్పెషల్ అనే చెప్పాలి. ఈ అమ్మడు బిగ్ బాస్ సెవన్ లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి అందరి చూపు ఈ భామ పైనే.. బిగ్ బాస్ లో తనదైన గేమ్ స్ట్రాటజీతో ప్రేక్షకులను అలరిస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది శుభ శ్రీ. అసలు ఈ అమ్మాయి ఎవరు.? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి.? అనేది చాలా మందికి తెలియదు.
Updated on: Sep 28, 2023 | 1:56 PM

బిగ్ బాస్ సీజన్ 7 లో చాల మంది అందాల భామలు ఉన్నారు. వెళ్లిన 14 మందిలో శుభశ్రీ రాయగురు స్పెషల్ అనే చెప్పాలి. ఈ అమ్మడు బిగ్ బాస్ సెవన్ లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి అందరి చూపు ఈ భామ పైనే..

బిగ్ బాస్ లో తనదైన గేమ్ స్ట్రాటజీతో ప్రేక్షకులను అలరిస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది శుభ శ్రీ. అసలు ఈ అమ్మాయి ఎవరు.? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి.? అనేది చాలా మందికి తెలియదు.

శుభా శ్రీ బెంగళూరులో 1997 జూలై 15న జన్మించింది. తన తల్లిదండ్రులు ముంబైకి చెందిన వారు కావడంతో ముంబైలో ‘లా’ పూర్తి చేసింది. అంతే కాదు శుభ శ్రీ క్లాసికల్ డాన్సర్ కూడా..

గేమ్ ఆడుతూనే తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకర్షిస్తుంది శుభ శ్రీ. టాస్క్ లలో తన సత్తా చూపుతూనే అటు గ్లామర్ పరంగాను మంచి ఓటింగ్ సొంతం చేసుకుంటుంది శుభ శ్రీ. ఇప్పటికే శుభా శ్రీ ఫాలోవర్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.

2020 ఫెమినా మిస్ ఇండియా ఒడిషాగా నిలిచింది ఈ బ్యూటీ. ఆతర్వాత ఈ చిన్నదానికి అవకాశాలు క్యూ కట్టాయి. శుభ శ్రీ చాలా యాడ్స్ లో నటించింది. అలాగే పలు సినిమాల్లోనూ నటించింది. రుద్రవీణ(కొత్త సినిమా), ‘కథ వెనక కథ’, అమిగోస్ లాంటి సినిమాల్లో చేసింది శుభ శ్రీ.




