- Telugu News Photo Gallery Cinema photos Bhagavanth kesari to salaar latest telugu movie shooting update
Movie Updates: షూటింగ్ కంప్లీట్ చేసుకున్న బాలయ్య.. ప్రభాస్ లేకపోయినా ఆగని చిత్రీకరణ..
చిరంజీవి కాలికి సర్జరీ కావడంతో మరికొన్ని రోజుల వరకు కెమెరా ముందుకు రాలేరు.. ఆర్టిస్టుల డేట్స్ లేక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ మరోసారి వాయిదా పడింది.. ప్రభాస్ కూడా ఫారెన్‌లోనే ఉన్నారు.. పవన్ మళ్లీ వారాహి యాత్రతో బిజీ అయిపోయారు. వీళ్లు మినహా హీరోలందరూ లొకేషన్‌లోనే ఉన్నారు. మరి వాళ్లెక్కడున్నారు.. ఏయే సినిమాలతో బిజీగా ఉన్నారు.. షూటింగ్ అప్‌డేట్స్ ఏంటి చూద్దాం..! రాజకీయంగా బిజీగా ఉన్నా కూడా తన భగవంత్ కేసరి షూటింగ్ పూర్తి చేసారు బాలయ్య. ఈ వారమే షూటింగ్ పూర్తి కావడంతో.. ప్రశాంతంగా పాలిటిక్స్‌పై ఫోకస్ చేసారు ఈయన.
Updated on: Oct 03, 2023 | 3:14 PM

రాజకీయంగా బిజీగా ఉన్నా కూడా తన భగవంత్ కేసరి షూటింగ్ పూర్తి చేసారు బాలయ్య. ఈ వారమే షూటింగ్ పూర్తి కావడంతో.. ప్రశాంతంగా పాలిటిక్స్‌పై ఫోకస్ చేసారు ఈయన.

ప్రభాస్ ఇండియాలో లేకపోయినా ఆయన మూడు సినిమాల షూటింగ్స్ ఆగట్లేదు. ఓ వైపు శంకరపల్లిలో నాగ్ అశ్విన్ కల్కి.. అల్యూమీనియం ఫ్యాక్టరీలో మారుతి సినిమా షూటింగ్ జరుగుతుండగా.. RFCలో సలార్ ప్యాచ్ వర్క్ జరుగుతుంది.

నాగార్జున నా సామిరంగా షూటింగ్ వట్టి నాగులపల్లి నుంచి పోచంపల్లికి షిఫ్ట్ అయింది. దేవర షూటింగ్ అల్యూమీనియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. అక్కడే కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు కొరటాల. మహేష్ బాబు, త్రివిక్రమ్ గుంటూరు కారం షూటింగ్ వారం రోజులుగా అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌కు మారింది. ఇక అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ RFCలోనే జరుగుతుంది.

ఉస్తాద్ రెండో షెడ్యూల్ పూర్తి చేసాక వారాహి యాత్రకు వెళ్లిపోయారు పవన్. విజయ్ దేవరకొండ, పరశురామ్ సినిమా తిమ్మాపురం పరిసర ప్రాంతాల్లో.. గోపిచంద్, శ్రీను వైట్ల సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతున్నాయి.

హాయ్ నాన్న షూటింగ్ పూర్తి చేసిన నాని.. ఈ వారమే వివేక్ ఆత్రేయ సినిమా షురూ చేసారు. దీని షూటింగ్ అల్యూమీనియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. అంటే సుందరానికి తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతుంది.




