నార్త్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసిన బాలయ్య..అఖండ2పై స్పెషల్ ఫోకస్!
ఇప్పటి వరకు రీజినల్, ఇక మీదట నేషనల్ అంటున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. వరుస విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న బాలయ్య అప్ కమింగ్ సినిమాతో కొత్త టార్గెట్ సెట్ చేసుకున్నారు. ఆల్రెడీ రీజినల్ మార్కెట్‌లో తిరుగులేదని ప్రూవ్ చేసుకున్న నందమూరి హీరో, నెక్ట్స్ మూవీతో నార్త్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తున్నారు.
Updated on: Jan 28, 2025 | 11:14 AM

సంక్రాంతి బరిలో డాకు మహారాజ్‌గా బిగ్ హిట్ అందుకున్న బాలయ్య, ఆల్రెడీ నెక్ట్స్ మూవీ పనులు స్టార్ట్ చేశారు. తన ఇమేజ్‌ను మార్చేసిన అఖండ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న అఖండ 2 తాండవంలో నటిస్తున్నారు. ఈ సినిమాతో నార్త్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తున్నారు నందమూరి హీరో.

అఖండ తొలి భాగంలో అఘోరా పాత్రతో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేశారు. ముఖ్యంగా బాలయ్య అభిమానులు కోరుకునే మాస్ యాక్షన్, పంచ్ డైలాగులు అఖండలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఆ సినిమా అంత పెద్ద విజయం సాధించింది.

ఇప్పుడు సీక్వెల్ విషయంలో ఈ ఎలిమెంట్స్‌తో పాటు మరికొన్ని యాడ్ చేయబోతున్నారట.అఖండ 2తో నార్త్ మార్కెట్ మీద ఫోకస్ చేస్తున్న బాలయ్య, ఆ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకొని కథా కథనాలు సిద్ధం చేస్తున్నారు.

సినిమా షూటింగ్‌ను కూడా మహాకుంభమేళాలో ప్రారంభించిన యూనిట్, అక్కడి ప్రేక్షకులకు నచ్చే రేంజ్‌లో మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌ను యాడ్ చేస్తున్నారు.

మామూలుగానే బాలయ్య, బోయపాటి కాంబో మీద ఓ రేంజ్ అంచనాలు ఉంటాయి. ఇప్పుడు అఖండకు సీక్వెల్ అనేసరికి ఆ అంచనాలు డబుల్ అయ్యాయి. అందుకే అభిమానుల ఎంత హై ఎక్స్‌పెక్ట్ చేసినా... అంతకు మించి ఉండేలా అఖండ 2ను ప్లాన్ చేస్తున్నారు నందమూరి నటసింహం.