- Telugu News Photo Gallery Cinema photos Anand Deverakonda is the hero of 90's – A Middle Class Biopic sequel
బిగ్ స్క్రీన్ మీదకి రానున్న 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ సీక్వెల్.. హీరో ఎవరంటే
ఓటీటీలో సూపర్ హిట్ అయిన కంటెంట్‌ను బిగ్ స్క్రీన్ మీద చూపించేందుకు ట్రై చేస్తున్నారు మేకర్స్. డిజిటల్‌లో సూపర్ హిట్ అయిన ప్రాజెక్ట్స్‌ను ఇప్పుడు వెండితెర మీదకు తీసుకువస్తున్నారు. సూపర్ హిట్ కథలకు ప్రీక్వెల్స్, సీక్వెల్స్‌గా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్‌లో డిజిటల్‌లో సూపర్ హిట్ అయిన ప్రాజెక్ట్ '90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్'.
Updated on: Jan 17, 2025 | 7:29 PM

రీసెంట్ టైమ్స్‌లో డిజిటల్‌లో సూపర్ హిట్ అయిన ప్రాజెక్ట్ '90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్'. పీరియాడిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ షో ప్రతీ తెలుగు ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అయ్యింది.

అందుకే ఈ షోకు సీక్వెల్‌ను బిగ్ స్క్రీన్ మీద చూపించేందుకు ప్లాన్ చేస్తోంది సితార ఎంటర్‌టైన్మెంట్స్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సాయి సౌజన్యతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు నాగ వంశీ.

'90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్'లో చిన్న పిల్లాడి క్యారెక్టర్‌ను మెయిన్ లీడ్‌గా సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఆ క్యారెక్టర్‌లో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్నట్టుగా వెల్లడించారు. 'యాన్ అన్‌ఫినిష్డ్ స్టోరీ' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వైష్ణవీ చైతన్య హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఓటీటీలో సూపర్ హిట్ అయిన పొలిమేరకు సీక్వెల్‌ను సినిమాగా రూపొందించారు. సేమ్ కాస్టింగ్‌తో కాస్త బిగ్ స్కేల్‌లో సినిమాను ప్లాన్ చేసి హిట్ కొట్టారు. దీంతో మరిన్ని వెబ్ షోస్‌ను బిగ్ స్క్రీన్ మీదకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నార్త్‌లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది.

వరుస సీజన్లతో సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ మిర్జాపూర్‌కు ప్రీక్వెల్‌ను సినిమాగా ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ షో షూటింగ్ కూడా మొదలైంది. రీసెంట్‌గా సమంత లీడ్ రోల్‌లో నటించిన సిటాడెల్‌ను కూడా త్వరలో సినిమాగా రూపొందించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.




