- Telugu News Photo Gallery Cinema photos Amitabh Bachchan Grand Daughter Navya Naveli Nanda Gives Clarity On she will not enter in films telugu cinema news
Navya Naveli Nanda: హీరోయిన్లను మించిన అందం.. అయినా ఒక్క సినిమా ఆఫర్ రాలేదంట.. అమితాబ్ మనవరాలు నవ్య నంద గురించి తెలుసా..
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముద్దుల మనవరాలు నవ్య నవేలికి ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. చూడచక్కని రూపం.. కలువల్లాంటి కన్నులతో కట్టిపడేస్తుంది. ఆమె ముందు హీరోయిన్లు కూడా దిగదుడుపే.
Updated on: Jan 25, 2023 | 9:41 PM

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముద్దుల మనవరాలు నవ్య నవేలికి ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. చూడచక్కని రూపం.. కలువల్లాంటి కన్నులతో కట్టిపడేస్తుంది. ఆమె ముందు హీరోయిన్లు కూడా దిగదుడుపే.

అమితాబ్ బచ్చన్ దంపతులు సోషల్ మీడియా వేదికగా పలుసార్లు ఆమెపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. అయితే గతకొన్ని రోజులుగా నవ్య సినిమాల్లో నటించనుందనే వార్తలు నెట్టింట ప్రచారమవుతున్నాయి. దీనిపై తాజాగా ఆమె వివరణ ఇచ్చింది.

తనకు ఎలాంటి సినిమా ఆఫర్స్ రాలేదని.. అలాగే సినిమాల్లో నటించాలనే ఆసక్తి కూడా లేదని అన్నారు నవ్య. ప్రస్తుతం ఇష్టమైన రంగంలోనే కొనసాగుతున్నట్లు చెప్పారు.

సినీరంగంలో నేను రాణించలేనని నా అభిప్రాయం. ఎందుకంటే మనకు నచ్చిన రంగంలో మనం 100శాతం ఆసక్తిగా పనిచేయగలం. చిత్రపరిశ్రమ నాకు నచ్చే రంగం కాదు.

నాకు దానిపై ఆసక్తి తక్కువ. నేనిప్పుడు నాకు ఇష్టమైన రంగంలో ఉన్నాను. నటనను వృత్తిగా ఎంచుకోవాలని నేను అనుకోవడం లేదు. నాకు చాలా సినిమాల్లో ఆఫర్లు వచ్చాయని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు.

ఇప్పటివరకు నాకు ఒక్క సినిమాలో కూడా అవకాశం రాలేదు. అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నవ్య ఆరా హెల్త్’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించింది.

దాని ద్వారా ఆరోగ్యం, పరిశుభ్రత విషయాల్లో మహిళలకు తోడ్పాటు అందిస్తోంది. తనకు నటనపై ఆసక్తి లేదని ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇచ్చింది నవ్య.




