- Telugu News Photo Gallery Cinema photos Allu arjun and chiranjeevi are working to complete their films Vishwambhara and pushpa 02 quickly
Chiranjeevi-Allu Arjun: టార్గెట్ ఫిక్స్.. స్పీడు పెంచిన చిరు – బన్నీ
ఒకే మిషన్ మీద పనిచేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి అండ్ ఐకాన్ స్టార్ బన్నీ. మామా అల్లుళ్లు ఇంతకూ ఏం గోల్ పెట్టుకున్నారు? ఆ మిషన్ ఎంత వరకు వచ్చింది? సినిమాకు సంబంధించిందేనా? మరేదైనానా? వీరిద్దరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? డీటైల్డ్ గా చూసేద్దాం రండి... మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట తెరకెక్కిస్తున్న సినిమా విశ్వంభర. ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఫస్టాఫ్ చిత్రీకరణ ముగిసిందట.
Updated on: Apr 01, 2024 | 7:35 PM

ఒకే మిషన్ మీద పనిచేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి అండ్ ఐకాన్ స్టార్ బన్నీ. మామా అల్లుళ్లు ఇంతకూ ఏం గోల్ పెట్టుకున్నారు? ఆ మిషన్ ఎంత వరకు వచ్చింది? సినిమాకు సంబంధించిందేనా? మరేదైనానా? వీరిద్దరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? డీటైల్డ్ గా చూసేద్దాం రండి...

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట తెరకెక్కిస్తున్న సినిమా విశ్వంభర. ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఫస్టాఫ్ చిత్రీకరణ ముగిసిందట. వినడానికి కాస్త నమ్మలేనట్టే ఉన్నా... ఇదే నిజం అని అంటోంది మూవీ యూనిట్.

ఈ సారి ఎలాగైనా సక్సెస్ కొట్టాల్సిందేనని డబుల్ ఫోకస్‌తో పని చేస్తున్నారు మెగాస్టార్. అందుకే యమా స్పీడ్‌గా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు. జూన్ నెలాఖరుకి మొత్తం షూటింగ్ పూర్తి చేసేలా షెడ్యూల్స్ చేశారట వశిష్ట. జులై నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీ కానుంది విశ్వంభర టీమ్. ఆల్రెడీ చెప్పిన టైమ్‌కి.. అంటే, జనవరి 10న సినిమాను రిలీజ్ చేయాలన్నది గోల్. రిలీజ్ డేట్ విషయంలో అసలు తగ్గేదేలే అని అంటున్నారు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్.

ఆగస్టు 15న పుష్ప 2 వచ్చేస్తుందని మళ్లీ మళ్లీ చెబుతోంది టీమ్. మాట తప్పకూడదన్న కాన్సెప్ట్ తో టీమ్‌ని పరుగులు పెట్టిస్తున్నారు మాస్టర్ సుకుమార్. ఇటీవల రాయలసీమలోనూ షూటింగ్ చేశారు.

ఓ వైపు షూటింగ్ చేస్తున్నా, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనుల మీద కూడా గట్టిగానే ఫోకస్ చేస్తున్నారట సుకుమార్. రీసెంట్‌గా దుబాయ్‌లో మైనపు విగ్రహావిష్కరణలో పార్టిసిపేట్ చేశారు బన్నీ. అక్కడ కూడా తగ్గేదేలే పోజులోనే ఉంది విగ్రహం. ఈ సారి అసలు తగ్గేదేలే అన్నట్టు వస్తోందట ప్రాజెక్ట్. చెప్పిన టైమ్‌కి అల్లు అర్జున్ సినిమా థియేటర్లలో వాలాల్సిందే... ప్యాన్ ఇండియా హద్దులు దాటి సక్సెస్ మోత మోగాల్సిందే అనే లక్ష్యంతో పనిచేస్తోంది యూనిట్.




