- Telugu News Photo Gallery Cinema photos Actress Sreeleela waiting for big Hit in Tollywood with her next movie update on September 2024 Telugu Heroines Photos
Sreeleela: ఇప్పుడు టైం బ్యాడ్.. ఇప్పుడు శ్రీలీల ఏం చేస్తున్నది అనేదే ప్రశ్న.!
ఒక్కోసారి టైమ్ మనది కాదు అని తెలిసినపుడు.. వెయిట్ చేయడం కంటే మంచి పని మరోటి లేదు. మన టైమ్ వచ్చినపుడు మళ్లీ రెచ్చిపోవడమే..! ఇప్పుడు శ్రీలీల చేస్తున్నదిదే. రయ్‌మంటూ వచ్చి రచ్చ చేసిన ఈ భామకు ఇప్పుడు మునపట్లా ఆఫర్స్ లేవు. అందుకే ఓపిగ్గా వేచి చూస్తూ.. ఫ్యూచర్ ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నారు శ్రీలీల. మరి ఈమె ఏం చేస్తున్నారు..? టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. గతేడాది వరకు ఖాళీ లేకుండా ఉన్న శ్రీలీల..
Updated on: Sep 20, 2024 | 3:13 PM

ఒక్కోసారి టైమ్ మనది కాదు అని తెలిసినపుడు.. వెయిట్ చేయడం కంటే మంచి పని మరోటి లేదు. మన టైమ్ వచ్చినపుడు మళ్లీ రెచ్చిపోవడమే..! ఇప్పుడు శ్రీలీల చేస్తున్నదిదే.

రయ్‌మంటూ వచ్చి రచ్చ చేసిన ఈ భామకు ఇప్పుడు మునపట్లా ఆఫర్స్ లేవు. అందుకే ఓపిగ్గా వేచి చూస్తూ.. ఫ్యూచర్ ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నారు శ్రీలీల. మరి ఈమె ఏం చేస్తున్నారు..?

టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. గతేడాది వరకు ఖాళీ లేకుండా ఉన్న శ్రీలీల.. ఇప్పుడు ఖాళీ అయిపోయారు. ప్రస్తుతానికి ఈమె చేతిలో మూడు సినిమాలున్నాయి. నితిన్ రాబిన్ హుడ్‌తో పాటు రవితేజ 75వ సినిమాలో నటిస్తున్నారు శ్రీలీల.

దాంతో పాటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్‌లోనూ నటిస్తున్నారు. వీటితో నితిన్ సినిమా పూర్తైంది.. మిగిలిన రెండూ షూటింగ్స్ జరగట్లేదు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదలవ్వడానికి ఇంకా టైమ్ ఉంది.

దాంతో నితిన్, రవితేజ సినిమాలపైనే శ్రీలీల కెరీర్ ఆధారపడి ఉందిప్పుడు. ఈ గ్యాప్‌లో కోలీవుడ్‌పైనా ఓ కన్నేస్తున్నారు శ్రీలీల. రెండేళ్లుగా బ్రేక్ లేకుండా పని చేస్తున్న శ్రీలీల.. దొరికిన కాస్త ఖాళీ టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్ చేస్తున్నారు. మరోవైపు హిందీలోనూ శ్రీలీలకు ఆఫర్స్ వస్తున్నాయి. అక్కడ రెండు సినిమాలు సైన్ చేసారు ఈ బ్యూటీ.

సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం ఖాన్ మొదటి సినిమాతో పాటు.. వరుణ్ ధావన్‌తోనూ ఓ సినిమా చేయబోతున్నారు శ్రీలీల. మొత్తానికి అన్ని ఇండస్ట్రీలు కవర్ చేస్తున్నారు ఈ బ్యూటీ. టాలీవుడ్‌లో మాత్రం తనదైన టైమ్ కోసం వేచి చూస్తున్నారు.




