Samyuktha: క్రేజీ ఆఫర్ అందుకున్న సంయుక్త.. ‘దియా’గా మారిన అందాల తార..
భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సంయుక్త మీనన్. మొదటి సినిమాతోనే అమాయకమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస హిట్స్ అందుకుంటూ గోల్డెన్ బ్యూటీగా ట్యాగ్ సొంతం చేసుకుంది. బింబిసార, సార్ వంటి చిత్రాలతో అలరించిన సంయుక్తకు.. తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.