- Telugu News Photo Gallery Cinema photos Actress Faria Abdullah latest stunning pics in red saree goes viral
Faria Abdullah: ఈ గుమ్మా అణువు అణువు తాకిన ఆ చీరది ఎంత అదృష్టమో.. లవ్లీ ఫారియా..
జాతిరత్నాలు చిత్రంతో చిట్టిగా తెలుగు కుర్రాళ్ల మనసు దోచేసిన ముద్దుగుమ్మ ఫారియా అబ్దుల్లా. తెలుగు చిత్రాల్లో కథానాయకిగా ఎక్కువగా నటిస్తుంది. హైదరాబాద్ ఈ ముద్దుగుమ్మ స్వస్థలం. తాజాగా ఈ వయ్యారి భామ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలు చూసిన కుర్రకూరు ఫిదా అయిపోతున్నారు. కొందమంది వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వాటి సంగతి ఏంటో చూద్దాం రండి..
Updated on: Sep 11, 2024 | 3:42 PM

28 మే 1998న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జన్మించింది అందాల తార ఫరియా అబ్దుల్లా. ఆమె హిందీ-ఉర్దూ మాట్లాడే ముస్లిం కుటుంబనికి చెందినది. అయితే సినిమాపై ఉన్న ఇష్టంతో తన కెరీర్ కోసం తెలుగు నేర్చుకుంది.

ఈ వయ్యారి మొదట థియేటర్ నటిగా పనిచేసింది. 2021లో తెలుగు కామెడీ డ్రామా చిత్రం జాతి రత్నాలుతో సినిమాతో చలనచిత్ర అరంగేట్రం చేసింది. ఇందులో ఆమె పాత్ర గురించి ది హిందూ జర్నలిస్ట్ సంగీతా దేవి డూండూ ఫారియా మంచి స్క్రీన్ ప్రెజెన్స్‌ని కలిగి ఉంది అని రాశారు.

2023లో ఒక ఇంటర్వ్యూలో ఆమె తన పబ్లిక్ ఇమేజ్ ఆ పాత్రతో సన్నిహితంగా ముడిపడి ఉందని ప్రకటించింది. ఈ సినిమాలో ఆమె నటనకి 2022లో జరిగిన 10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ (SIIMA) అవార్డ్స్‌లో నామినేట్ చేయబడింది.

ఆమె 2022లో లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్, 2023లో రావణాసుర చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించింది. అదే సంవత్సరం , ది జెంగాబురు కర్స్ అనే హిందీ వెబ్ సిరీస్ తో మొదటిసారి డిజిటల్ లో కనిపించింది, ఇందులో ఆమె ప్రధాన పాత్ర పోషించింది.

ఇటీవల అల్లరి నరేష్ సరసన ఆ ఒక్కటి అడక్కు అనే టాలీవుడ్ రొమాంటిక్ కామెడీ చిత్రంతో నటించింది. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో ఫారియా చాల అందంగా కనిపించి మెప్పించింది.




