Rashmika Mandanna: వైరల్‌గా మారిన రష్మిక పోస్ట్.. ఆ హీరో కోసమే అంటున్న ఫ్యాన్స్
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఏం చేసిన సెన్సేషనల్ అవుతుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి అలరిస్తుంది ఈ అమ్మడు.
Updated on: Jul 15, 2024 | 4:40 PM

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఏం చేసిన సెన్సేషనల్ అవుతుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి అలరిస్తుంది ఈ అమ్మడు.

ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంటుంది. ఇటీవలే యానిమల్ సినిమాతో భారీ హిట్ అందుకుంది రష్మిక మందన్న.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారింది రష్మిక మందన్న. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ పోస్ట్ షేర్ చేసింది. నా జీవితంలోకి వచ్చినందుకు చాలా థాంక్స్ అంటూ ఓ పోస్ట్ షేర్ చేసింది.

అయితే ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. రష్మిక ఎవరికోసం ఆ పోస్ట్ పెట్టిందంటూ నెటిజన్స్ గుసగుసలాడుకుంటున్నారు. విజయ్ దేవరకొండ , రష్మిక రిలేషన్ లో ఉన్నారంటూ చాలా రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అలాగే ఈ ఇద్దరూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు విజయ్ కోసమే రష్మిక ఆ పోస్ట్ చేసి ఉంటుందని అంటున్నారు నెటిజన్స్. మరి దీని పై రష్మిక ఏమంటుందో చూడాలి.