- Telugu News Photo Gallery Cinema photos Actress Poorna Alias Shamna Kasim Shares Their Bakrid Celebrations Photos
Actress Poorna: పూర్ణ ఇంట్లో బక్రీద్ వేడుకలు.. కుమారుడిని చూశారా? అప్పుడే ఎంత పెద్దయ్యాడో? ఫొటోస్ వైరల్
ప్రముఖ నటి పూర్ణ అలియాస్ షమ్నా ఖాసీం దుబాయ్ కు చెందిన వ్యాపార వేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరి ఇంట్లో బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను నటి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Updated on: Jun 08, 2025 | 2:51 PM

శనివారం (జూన్ 07) దేశవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముస్లింలు భక్తి శ్రద్ధలతో ప్రార్తనలు నిర్వహించారు. ఈ బక్రీద్ వేడుకల్లోసామాన్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా భాగమయ్యారు.

ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖ నటి పూర్ణ అలియాస్ షమ్నా ఖాసీం ఇంట్లో బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను నటి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా పూర్ణ కుమారుడు చాలా పెద్దవాడయ్యాడంటూ కాంప్లిమెంట్స్ కురిపిస్తున్నారు నెటిజన్స్

దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీతో పెళ్లి పీటలెక్కంది పూర్ణ. 2022 జూన్ 12న దుబాయిలోనే తన పెళ్లి జరిగినట్లు ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది పూర్ణ. ఆ తర్వాత 2023 ఏప్రిల్‌లో హమ్దాన్ అసిఫ్ అలీ అనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది పూర్ణ.

కాగా గతంలో కంటే ప్రస్తుతం సినిమాలు బాగా తగ్గించేసింది పూర్ణ. ఆ మధ్యన గుంటూరు కారంలో నటించిన ఈ అందాల తార ప్రస్తుతం ఎక్కువగా టీవీ షోల్లోనే కనిపిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది.



















