- Telugu News Photo Gallery Cinema photos Actress Payal Ghosh once again made sensational comments on the casting couch
Payal Ghosh: ఆ దర్శకులుకు నేను లొంగిపోయి ఉంటే ముప్పై సినిమాలు చేసుండేదాన్ని : పాయల్ గోష్
ఈ అమ్మడు క్యాస్టింగ్ కౌచ్ గురించి గళం విప్పిన విషయం తెలిసిందే. ఓ దర్శకుడు తనను లైగికంగా వేధించాడని షాకింగ్ కామెంట్స్ చేసింది.
Updated on: Jul 07, 2023 | 1:11 PM

పాయల్ గోష్.. ఈ బాలీవుడ్ నటి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. మంచు మనోజ్ నటించిన ప్రయాణం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఆతర్వాత మళ్లీ హీరోయిన్ గా నటించలేదు ఈ అమ్మడు. ఆతర్వాత ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది ఈ అమ్మడు.

ఇక ఈ అమ్మడు క్యాస్టింగ్ కౌచ్ గురించి గళం విప్పిన విషయం తెలిసిందే. ఓ దర్శకుడు తనను లైగికంగా వేధించాడని షాకింగ్ కామెంట్స్ చేసింది.

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై లైంగిక వేదింపుల ఆరోపణలు చేసిన హాట్ టాపిక్ అయ్యింది పాయల్ గోష్.

తాజాగా తన కొత్త సినిమాను అనౌన్స్ చేసింది పాయల్. ఈ అమ్మడు నటిస్తున్న 11వ సినిమా ఇది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది

నేను చేస్తున్న 11వ సినిమా ఇది.. ఒక వేళ కొంతమంది దర్శకులు అడిగినట్టు పడుకుంటే.. ఇప్పటికి 30 సినిమాలు చేసుండేదాన్ని అని కామెంట్ చేసింది.

సినిమాల్లో ఆఫర్లు కావాలంటే కొన్ని వదులుకోవాలి అంటూ పాయల్ గోష్ చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు వైరల్ గా మారాయి.





























