- Telugu News Photo Gallery Cinema photos Fans are worried about Pooja Hegde missing Mahesh Babu and Pawan Kalyan movies
Pooja Hegde: ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన పూజా.. ఈ టైంలో రిస్క్ అవసరమా బుట్టబొమ్మ..
దాంతో ఈ భామకు ఐరన్ లెగ్ అనే ట్యాగ్ ను తగిలించుకుంది. ఈ అమ్మడు హీరోయిన్ గా నటిస్తుందంటే.. ఆ సదరు హీరోల ఫ్యాన్స్ కంగారు పడేలా చేసింది.
Updated on: Jul 07, 2023 | 12:48 PM

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో స్టార్ హీరోయిన్ గా రాణించిన బ్యూటీస్ లో పూజ హెగ్డే ఒకరు. ఈ అమ్మడు తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ ను సొంతం చేసుకుంది.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది పూజ. యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరితో కలిసి నటించింది ఈ అమ్మడు.

ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో పూజా చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.

వరుసగా స్టార్ హీరోల సరసన సినిమాలో నటిస్తున్నప్పటికీ ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి.

దాంతో ఈ భామకు ఐరన్ లెగ్ అనే ట్యాగ్ ను తగిలించుకుంది. ఈ అమ్మడు హీరోయిన్ గా నటిస్తుందంటే.. ఆ సదరు హీరోల ఫ్యాన్స్ కంగారు పడేలా చేసింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు వచ్చిన రెండు క్రేజీ ఆఫర్స్ ను చేజార్చుకోవడంతో పూజ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ బాబు గుంటూరు కారం, అలాగే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను మిస్ చేసుకుంది పూజా.. ఈ రెండు సినిమాలకు ఇప్పుడు హిట్ బజ్ కనిపిస్తుంది. దాంతో పూజా మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది అని అంటున్నారు ఫ్యాన్స్




