- Telugu News Photo Gallery Cinema photos Actress Meenakshi Chaudhary Upcoming Movies and Social Media Phosts
Meenakshi Chaudhary: సైలెంట్ అయిన మీనాక్షి.. హిట్టుకొట్టినా అమ్మాడి జోరు కనిపించట్లేందేంటీ.. ?
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదు దూసుకుపోయింది హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు చేతినిండా సినిమాలు ఉన్నప్పటికీ సైలెంట్ గా ఉంటుంది. కొన్ని నెలలుగా ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి.
Updated on: Jun 10, 2025 | 9:41 PM

హీరోయిన్ మీనాక్షి చౌదరీ.. తెలుగు సినీప్రియులకు పరిచయం అవసరంలేని పేరు. 2017లో మిస్ ఐఎమ్ఏ పోటీల్లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తెలుగులోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ వయ్యారి.

ఆ తర్వాత కొన్నాళ్లకు రవితేజ సరసన ఖిలాడీ మూవీతో మరోసారి తెలుగు సినీప్రియులను అలరించింది. కొన్నాళ్లు ఆడపాదడపా చిత్రాల్లో కనిపించిన ఈ వయ్యారి.. హిట్ 2 సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో ఈ అమ్మడుకు వరుస ఆఫర్స్ వచ్చాయి.

వెంటనే మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంలో చిన్న పాత్ర పోషించింది. ఆ తర్వాత మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ జోడిగా లక్కీ భాస్కర్ చిత్రంలో నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో గృహిణిగా అద్భుతమైన నటనతో కట్టిపడేసింది.

ఇక ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ అందుకుంది.ఇందులో వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత వరుస ప్రాజెక్ట్స్ ప్రకటిస్తుందని అనుకున్నారు. కానీ అలా కాకుండా ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.

తాజాగా చీరకట్టులో అచ్చం బుట్టబొమ్మలా ముస్తాబై ఫోటోస్ షేర్ చేసింది మీనాక్షి. ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట కట్టిపడేస్తున్నాయి. ప్రస్తుతం అనగనగా ఒక రాజు చిత్రంలో నటిస్తుంది. అలాగే ఈ బ్యూటీ ఖాతాలో మరిన్ని సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.




