- Telugu News Photo Gallery Cinema photos Actress Krithi Shetty Next Movie Updates Telugu Heroines Photos
Krithi Shetty: కృతి కి బ్యాడ్ టైం ఇంకా నడుస్తుందా..! నెక్స్ట్ ప్రాజెక్ట్ పై బేబమ్మ మాటేంటి.?
నా నడక మారింది.. తీరు మారింది.. స్టైల్ మారింది.. అన్నట్లు అన్నీ మార్చేస్తున్నారు కృతి శెట్టి. ఏంటి నమ్మరా..? ఎందుకు నమ్మరు చెప్పండి.. మిమ్మల్ని నమ్మించే పూచీ మాది. ఈ మధ్య వరస ఫ్లాపులు రావడంతో దెబ్బకు బేబమ్మలో భారీగా మార్పులొస్తున్నాయి. ఒక్క హిట్ కోసం కంప్లీట్ గెటప్, సెటప్ మార్చేస్తున్నారు కృతి. తాజాగా మరో హాట్ ఫోటోషూట్‌తో సెగలు పుట్టిస్తున్నారీ ఉప్పెన సుందరి.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Anil kumar poka
Updated on: Oct 16, 2023 | 7:11 AM

నా నడక మారింది.. తీరు మారింది.. స్టైల్ మారింది.. అన్నట్లు అన్నీ మార్చేస్తున్నారు కృతి శెట్టి. ఏంటి నమ్మరా..? ఎందుకు నమ్మరు చెప్పండి.. మిమ్మల్ని నమ్మించే పూచీ మాది.

ఈ మధ్య వరస ఫ్లాపులు రావడంతో దెబ్బకు బేబమ్మలో భారీగా మార్పులొస్తున్నాయి. ఒక్క హిట్ కోసం కంప్లీట్ గెటప్, సెటప్ మార్చేస్తున్నారు కృతి. తాజాగా మరో హాట్ ఫోటోషూట్‌తో సెగలు పుట్టిస్తున్నారీ ఉప్పెన సుందరి.

టైటిల్‌కు తగ్గట్లే ఉప్పెనలా ఇండస్ట్రీకి దూసుకొచ్చిన బ్యూటీ కృతి శెట్టి. ఏం జరిగిందో తెలుసుకుని తేరుకునేలోపే మూడు వరస విజయాలు వచ్చేసాయి. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజుతో దెబ్బకు గోల్డెన్ లెగ్ అయిపోయింది ఈ బ్యూటీ.

కానీ అంతలోనే టైం టర్న్ అయింది. హ్యాట్రిక్ హిట్స్‌లా హ్యాట్రిక్ ఫ్లాప్స్ వచ్చాయి. మొన్నొచ్చిన కస్టడీ అయితే వచ్చినట్లు కూడా తెలియకుండా వెళ్లిపోయింది. మాచర్ల నియోజకవర్గం, వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.

కస్టడీ ఫ్లాపులతో కృతి శెట్టి రేంజ్ ఒక్కసారిగా పడిపోయింది. మలయాళంలో అజయంతే రాండాం మోషనం.. తమళంలో జెన్నీ సినిమాలో నటిస్తున్నారు కృతి. తెలుగులో అయితే ఈమెకు ఏ ఆఫర్స్ రాలేదు. దాంతో గ్లామర్ డోస్ పెంచేసారు ఈ బ్యూటీ.

లేటెస్ట్‌గా హాట్ ఫోటోషూట్ చేసారు బేబమ్మ. ఉప్పెనలో జలజలపాతం సాంగ్.. శ్యామ్ సింగరాయ్‌లో నానితో లిప్ లాక్ చేసినా.. గ్లామర్ షో విషయంలో కాస్త హద్దుల్లోనే ఉన్నారు కృతి. కానీ ఈ మధ్య ఈమె పద్దతులు మారిపోయాయి.

చిట్టిపొట్టి క్యాస్ట్యూమ్స్‌లో కనిపిస్తూ గ్లామర్ మంత్రం జపిస్తున్నారు. కనీసం ఈ గ్లామర్ షోతో అయినా తన జాతకం మారిపోతుందని నమ్ముతున్నారు కృతి. మరి అది జరుగుతుందో లేదో చూడాలిక.





























