- Telugu News Photo Gallery Cinema photos Actress Divya Bharathi Stunning Golden Saree Photos Goes Viral
Divya Bharathi : ఏం అందం రా బాబూ.. బంగారు రంగు చీరలో కుందనపు బొమ్మ.. కట్టిపడేస్తోన్న వయ్యారం.
తమిళ చిత్రపరిశ్రమలో ఇప్పుడిప్పుడే రాణిస్తోన్న హీరోయిన్లలో దివ్య భారతి ఒకరు. అందం, అభినయంతో కట్టిపడేసింది. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల ఆరాధ్య దేవతగా మారిపోయింది. సోషల్ మీడియాలో నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లకు కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా బంగారు రంగు చీరలో మంత్రముగ్దులను చేస్తుంది.
Updated on: Nov 03, 2025 | 1:29 PM

తమిళ చిత్రపరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో దివ్య భారతి ఒకరు. జీవీ ప్రకాష్ హీరోగా నటించిన బ్యాచిలర్ సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఫస్ట్ సినిమాతో అందం, అభినయంతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది ఈ వయ్యారి.

ఆ తర్వాత మరోసారి జీవీ ప్రకాష్ సరసన జతకట్టింది. అలాగే తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటుంది. మరోవైపు సుడిగాలి సుధీర్ సరసన గోట్ చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. మరోవైపు సోషల్ మీడియాలో ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది దివ్య భారతి. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన బంగారు రంగు చీరలో ఫోటోషూట్స్ అందరిని మెస్మరైజ్ చేస్తున్నాయి.

బంగారు రంగు చీరకట్టులో ట్రెడిషనల్ లుక్ తో మరింత అందంగా ముస్తాబయ్యింది దివ్య భారతి. ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ వైరల్ గా మారాయి. ఇటు ట్రెడిషనల్.. అటు గ్లామర్ ఫోటోషూట్లతో నెట్టింట నానా రచ్చ చేస్తుంది ఈ వయ్యారి.

ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. తెలుగులో ఆమె నటిస్తున్న గోట్ చిత్రానికి నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తుండగా.. ఇదివరకు విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.




