- Telugu News Photo Gallery Cinema photos Actress bindu madhavi latest beautiful photos goes viral on internet
Bindu Madhavi: బిగ్ బాస్ బ్యూటీ బిందు మాదవి అదరగొట్టేసిందిగా..!
తెలుగులో ఎంతో మంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా ఆకట్టుకున్నారు. కొంతమంది కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. వారిలో ఈ బ్యూటీ ఒకరు. బిందు మాధవి.. ఈ తెలుగమ్మాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు “అవకాయ్ బిర్యానీ” తో తన సినీ కెరీర్ మొదలుపెట్టింది.
Updated on: Sep 12, 2025 | 1:51 PM

తెలుగులో ఎంతో మంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా ఆకట్టుకున్నారు. కొంతమంది కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. వారిలో ఈ బ్యూటీ ఒకరు. బిందు మాధవి.. ఈ తెలుగమ్మాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు “అవకాయ్ బిర్యానీ” తో తన సినీ కెరీర్ మొదలుపెట్టింది.

ఈ సినిమా సెకండాండ్రి రాజు దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చినప్పటికీ, తర్వాత ఆమె తమిళ సినిమా పరిశ్రమ వైపు దృష్టి సారించింది. తమిళంలో “పొక్కిషం”, “కజుగు”, “కెడి బిల్లా కిల్లాడి రంగా” వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది.

తెలుగులో “రామ రామ కృష్ణ కృష్ణ”, “పిల్ల జమీందార్” వంటి సినిమాల్లో కూడా ఆమె నటన ప్రశంసలు అందుకుంది. బిందు మాదవి 2022లో తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమైన “బిగ్ బాస్ నాన్-స్టాప్” షో మొదటి సీజన్‌లో పాల్గొని విజేతగా నిలిచింది. దీనితో ఆమె క్రేజ్ మరింత పెరిగింది.

ఇక ఈ అమ్మడు ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 9కు సంబంధించిన అగ్నిపరీక్ష షోకు జడ్జ్ గా వ్యవహరించింది. జడ్జ్ గా బిందు మాదవి అదరగొట్టింది. చాలా రోజుల తర్వాత బిందు మాదవి టీవీలో సందడి చేయడం ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న ఈ చిన్నది రెగ్యులర్‌గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడి బ్యూటీఫుల్ ఫోట్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలకు కుర్రాళ్ళు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.