- Telugu News Photo Gallery Cinema photos Actress Bhagyashri Borse Shares Crazy Photos in Her Instagram
Bhagyashri Borse : గ్లామర్ ఫోజులతో చంపేస్తోన్న హీరోయిన్.. చూపులతో కవ్విస్తున్న భాగ్య శ్రీ..
హిందీ సినిమాల్లో నటించి పాపులర్ అయ్యింది. కానీ ఎక్కువగా తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తనే భాగ్య శ్రీ బోర్సే. ఇప్పుడు కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. అందంతోనే మెస్మరైజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
Updated on: Sep 28, 2025 | 7:49 PM

భాగ్య శ్రీ బోర్సే.. తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా తనకంటూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసింది. ఆమె నటించిన రెండు చిత్రాల్లో ఒకటి అట్టర్ ప్లాప్.. మరొకటి హిట్.

రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన భాగ్య శ్రీ బోర్సే.. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన కింగ్డమ్ చిత్రంలో నటించింది. రెండు చిత్రాలతోనే విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.

హిందీలో యారియన్ 2 సినిమాతో తెరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత చందు ఛాంపియన్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత టాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. ప్రస్తుతం బ్యూటీ తెలుగులో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అలాగే మరిన్ని ఆఫర్స్ క్యూ కట్టాయి.

ప్రస్తుతం ఈ బ్యూటీ రామ్ పోతినేని సరసన ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రంలో నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. అలాగే దుల్కర్ సల్మాన్ జోడిగా కాంతా మూవీలో నటిస్తుంది. ఇవే కాకుండా తెలుగులో మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. చాలా కాలం తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన భాగ్య శ్రీ బోర్సే.. ఇప్పుడు నెట్టింట క్రేజీ గ్లామర్ ఫోటోస్ షేర్ చేసింది. చూరకత్తుల చూపులతో నెట్టింట మాయ చేస్తుంది ఈ బ్యూటీ. ఇప్పుడు ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.




