- Telugu News Photo Gallery Cinema photos Aamir Khan's Sitaare Zameen Par movie trailer is receiving criticism from fans due to this reason
Aamir Khan: విడుదలైన ఆమిర్ కొత్త మూవీ ట్రైలర్.. ఫ్యాన్స్ నుంచి విమర్శలు..
లాల్ సింగ్ చద్దా ఫెయిల్యూర్ తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న ఆమిర్ ఖాన్ ఫైనల్‌గా మరో మూవీని రిలీజ్‌కు సిద్ధం చేశారు. ఇన్నాళ్లు ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక్క అప్‌డేట్ కూడా ఇవ్వని మిస్టర్ పర్ఫెక్ట్ డైరెక్ట్‌గా ట్రైలర్‌తో సర్‌ప్రైజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ విషయంలో ఫ్యాన్స్‌తో పాటు అభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు.
Updated on: May 19, 2025 | 3:36 PM

హాలీవుడ్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన లాల్ సింగ్ చద్దా ఆమిర్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఫ్యాన్స్‌ను కూడా అలరించలేకపోయింది. వసూళ్ల పరంగానూ ఆమిర్ కెరీర్‌లో వరస్ట్ నెంబర్స్‌ను రికార్డ్ చేసింది.

దీంతో డైలమాలో పడ్డ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్, ఫైనల్‌గా తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్‌గా సితారే జమీన్ పర్‌ను పట్టాలెక్కించారు. పేరుకు సీక్వలే అయినా... తొలి భాగంతో ఏ మాత్రం సంబంధం లేని కథతో సితారే జమీన్ పర్‌ను రూపొందించారు.

ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే అమెరికన్ స్పోర్ట్స్ డ్రామా చాంపియన్స్‌ను మక్కీ టు మక్కీ దించేశారు. కనీసం ట్రైలర్ కట్‌ను కూడా మార్చకుండా యాజిటీజ్‌గా రీమేక్ చేయటంతో ఆమిర్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

ఆల్రెడీ ఓ హాలీవుడ్ సినిమాను రీమేక్ చేసి చేతులు కాల్చుకున్న ఆమిర్. ఇప్పుడు మరోసారి అదే తప్పు చేస్తుండటం. అది కూడా ఇంత పర్ఫెక్ట్‌గా కాపీ చేయటం మీద విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆమిర్ లాంటి హీరో నుంచి ఇలాంటి కంటెంట్ ఎక్స్‌పెక్ట్ చేయలేదంటున్నారు అభిమానులు. మరి ఈ విమర్శలకు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ తన ఫ్యాన్స్‌కు, సినిమా అభిమానులకు ఎలా ఆన్సర్ చేస్తారో చూడాలి.




