- Telugu News Photo Gallery Cinema photos A beauty in super form suddenly slows down, an unknown heroine suddenly busy in Tollywood
Heroines: ఓడలు బండ్లవ్వటం.. బండ్లు ఓడలవ్వటం.. ఆ హీరోయిన్స్ పరిస్థితి ఇదే..
ఓడలు బండ్లవ్వటం, బండ్లు ఓడలవ్వటం అన్న సామెత వినే ఉంటారు. ప్రజెంట్ సౌత్ సర్కిల్స్‌లో కొంత మంది హీరోయిన్లను చూస్తే ఈ సామెతే గుర్తొస్తుంది. సూపర్ ఫామ్‌లో ఉన్నట్టుగా కనిపించిన బ్యూటీ సడన్ స్లో అవ్వటం, అసలు పరిచయం లేని హీరోయిన్ ఒక్కసారిగా బిజీ అవ్వటం లాంటి ట్విస్ట్‌లు ఫిలిం సర్కిల్స్‌లో చాలానే కనిపిస్తున్నాయి.
Updated on: May 25, 2025 | 3:25 PM

నిన్న మొన్నటి వరకు టాలీవుడ్‌లో సూపర్ ఫామ్‌లో కనిపించారు హాట్ బ్యూటీ నేహా శెట్టి. రాధికగా పాపులర్ అయిన ఈ భామ, అప్‌కమింగ్ హీరోలతో వరుస సినిమాలు చేసింది. క్రేజీ ప్రాజెక్ట్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేసింది.

ఇంత ఫామ్‌లో కనిపించిన నేహా సడన్‌గా స్లో అయింది. గత ఏడాది టిల్లు స్క్వేర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాల్లో కనిపించిన నేహా చేతిలో ఇప్పుడు ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు. దీంతో ఈ బ్యూటీ ఏమైంపోయిందన్న ఎంక్వైరీలు మొదలయ్యాయి.

నేహా పరిస్థితి అలా ఉంటే.. సడన్‌గా సూపర్ ఫామ్‌లోకి వచ్చేశారు కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్. లాస్ట్ ఇయర్ నిఖిల్ హీరోగా తెరకెక్కిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీతో టాలీవుడ్‌కు పరిచయం అయింది ఈ బ్యూటీ.

ప్రజెంట్ ఎన్టీఆర్ - నీల్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. మరో వైపు మణిరత్నం, నవీన్ పొలిశెట్టి సినిమాలోనూ రుక్మిణినే హీరోయిన్ అన్న టాక్ వినిపిస్తోంది. దీని బట్టి చూస్తే ఈ ముద్దుగుమ్మ తెలుగులో బిజీ అయ్యేలానే కనిపిస్తుంది.

దీనికి కారణం కూడా లేకపోలేదు. నేహా శెట్టి చివరికి చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. అలాగే రుక్మిణి సప్త సాగరాలు దాటి సినిమాలతో తెలుగు మంచి క్రేజ్ అందుకుంది. ఇది కన్నడ బ్యూటీకి ప్లస్ అయింది అనే చెప్పాలి.




