ఒకప్పుడు వెలుగు వెలిగిన చాలా మంది సీనియర్ హీరోలకు ఇప్పుడు కనీస మార్కెట్ కూడా లేదు. సౌత్‌లో 60 ప్లస్ హీరోలకు ఇప్పటికీ బ్రహ్మరథం పడుతున్నారు కానీ నార్త్‌లో మాత్రం అందరికీ ఇప్పటికే దండం పెట్టేసారు ప్రేక్షకులు. ఇలాంటి సమయంలో ఇద్దరు హీరోలు 2023లో సత్తా చూపించారు. దాదాపు 20 ఏళ్ళ తర్వాత మేమున్నామని గుర్తు చేసారు.. వాళ్లే సన్నీ డియోల్, బాబీ డియోల్.