AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chia Seeds: చలిలోనూ చర్మం యవ్వనంగా, సాఫ్ట్‌గా ఉండాలంటే.. చియా సీడ్స్ సీక్రెట్ తెలుసుకోండి..

చలికాలంలో మన చర్మం పొడిబారి, పగుళ్లు వచ్చి, నిస్తేజంగా మారుతుంది. అందుకే ఈ సమయంలోచర్మానికి లోపలి నుండి పోషణ ఇవ్వడం చాలా ముఖ్యం. ఈ విషయంలో చియా సీడ్స్ ఒక అద్భుతమైన ఆప్షన్‌గా నిలుస్తున్నాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలతో నిండి ఉండటం వల్ల చర్మానికి సహజమైన మెరుపును అందిస్తాయి. క్రమం తప్పకుండా చియా గింజలను తీసుకోవడం వల్ల చర్మం హైడ్రేటెడ్‌గా ఉండి, ఆరోగ్యంగా కనిపిస్తుంది.

Krishna S
|

Updated on: Nov 20, 2025 | 5:20 PM

Share
చియా గింజల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. పరిమిత పరిమాణంలో తీసుకుంటే అవి జీర్ణక్రియకు మేలు చేస్తాయి. అదే అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ మందగించి జీర్ణ సమస్యలు వస్తాయి.

1 / 5
బరువు తగ్గడంలో ఆరోగ్యకరమైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో చియా గింజలు ముందు వరుసలో ఉంటాయి. చియా గింజల ఆరోగ్య ప్రయోజనాల కారణంగా చాలా మంది వీటిని విస్తృతంగా వినియోగిస్తుంటారు.

2 / 5
హైడ్రేషన్: చియా గింజలను నానబెట్టినప్పుడు అవి నీటిని పీల్చుకుని జెల్‌లా తయారవుతాయి. ఇది శరీరం ఎక్కువసేపు హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడుతుంది, ఫలితంగా చర్మం బొద్దుగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.

3 / 5
చియా గింజల్లో ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు,యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉన్నందున వాటిని సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. అయితే చియా విత్తనాలను అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
తీసుకోవాల్సిన విధానం: మీరు రోజూ ఒకటి నుండి రెండు చెంచాల చియా విత్తనాలను తీసుకోవచ్చు. జీర్ణక్రియ సులభంగా ఉండేందుకు, విత్తనాలను నానబెట్టి తినడం ఉత్తమం. ఉదయం అల్పాహారంలో లేదా భోజనంలో వీటిని కలిపి తీసుకోవడం వల్ల రోజంతా జీర్ణక్రియకు మద్దతు లభిస్తుంది.

5 / 5
Follow Us