- Telugu News Photo Gallery Chest pain during pregnancy? Do this without delay, Check Here is Details in Telugu
Chest Pain in Pregnancy: ప్రెగ్నెన్సీలో ఛాతిలో నొప్పి వస్తుందా.. లేట్ చేయకుండా ఇలా చేయండి..
సాధారణంగా ప్రెగ్నెన్సీలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. మహిఅళలు ఎన్నో సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. గర్భాధారణ సమయంలో గ్యాస్, అసిడిటీ కూడా వస్తూ ఉంటాయి. వీటి వలన ఒక్కోసారి గుండెల్లో నొప్పిగా, మంటగా అనిపిస్తుంది. ఇలా అనిపిస్తే వెంటనే ఇలా చేయండి..
Updated on: Dec 31, 2024 | 1:27 PM

మహిళలు గర్భం దాల్చిన దగ్గర నుంచి కాన్పు అయ్యేంత వరకు చాలా కష్టంగా ఉంటుంది. నిజంగానే ప్రెగ్నెన్సీ అనేది మహిళలకు ఓ పునర్జన్మ అని ఊరికే అనలేదు. గర్భాధారణ సమయంలో మహిళల్లో ఎన్నో రకాల మార్పులు వస్తాయి. అవన్నీ తట్టుకుని ఆనందంగా ఓ బిడ్డకు జన్మని ఇస్తుంది మహిళ.

ఈ గర్భాధారణ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఒక్కోసారి కొంత మంది మహిళల గుండెల్లో నొప్పిగా, మంటగా అనిపిస్తుంది. ఇలా రావడంతో కంగారు పడుతూ ఉంటారు. ఇలా ఉంటే మాత్రం ఏమాత్రం లేట్ చేయకుండా వైద్యుల్ని సంప్రదించడం ఉత్తమం.

ఈ చెస్ట్ పెయిన్ అనేది అనేక కారణాల వల్ల రావచ్చు. ప్రెగ్నెన్సీలో ఎక్కువగా గ్యాస్, అసిడిటీ వంటివి కూడా వస్తూ ఉంటాయి. ఈ కారణం వల్ల కూడా గుండెల్లో నొప్పిగా, మంటగా అనిపిస్తుంది. ఏం తినలేరు.. తాగలేరు.

ముందుగా నొప్పి వచ్చినప్పుడు ఇంటి చిట్కాలు ట్రై చేయండి. వీటి నుంచి ఉపశమనం పొందకపోతే మాత్రం ఆస్పత్రికి వెళ్లడం మంచిది. ఇలా గుండెల్లో మంటగా వచ్చినప్పుడు గోరు వెచ్చని నీళ్లు ఆరారగా తాగుతూ ఉండండి.

నిమ్మకాయ రసంలో నల్ల ఉప్పు లేదా తెల్ల ఉప్పు ఉన్నా కొద్దిగా కలిపి తాగండి. మజ్జిగలో నిమ్మకాయ, ఉప్పు కలిపి కూడా తాగవచ్చు. కాసేపటికి ఉపశమనం లభిస్తుంది. అయినా ఉపశమనం లభించకపోతే లేట్ చేయకుండా వైద్యుల్ని సంప్రదించండి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




