- Telugu News Photo Gallery Chanakya Niti Such people ruin the life of others it is better to stay away from them chanakya niti telugu
Chanakya Niti: అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండండి.. లేదంటే మీ జీవితాన్ని కూడా నాశనం చేస్తారు..
ఆచార్య చాణక్యుడి బోధనలు జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు దోహదపడతాయి. అందుకే.. నేటికీ చాలామంది చాణుక్యుడు నీతిశాస్త్రంలో బోధించిన విషయాలను అనుసరిస్తుంటారు. అయితే చాణక్యుడు ముఖ్యంగా కొందరు వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిదని బోధించాడు. అవేంటో చూద్దాం..
Updated on: Jun 02, 2022 | 2:55 PM

ఆచార్య చాణక్యుడి బోధనలు జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు దోహదపడతాయి. అందుకే.. నేటికీ చాలామంది చాణుక్యుడు నీతిశాస్త్రంలో బోధించిన విషయాలను అనుసరిస్తుంటారు. అయితే చాణుక్యుడు ముఖ్యంగా కొందరు వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిదని బోధించాడు.

ఆచార్య చాణక్యుడి బోధనలు జీవితంలో తప్పటడుగులు వేయకుండా ఉండేందుకు.. ఉన్నత స్థానంలో ఎదిగేందుకు దోహదపడతాయి. అందుకే.. నేటికీ చాలామంది చాణుక్యుడు నీతిశాస్త్రంలో బోధించిన విషయాలను అనుసరిస్తుంటారు. అయితే చాణుక్యుడు జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నాడు.

చెడు ప్రదేశాలలో నివసించే వారికి దూరంగా ఉండటం మంచిది. వారి చుట్టూ ఉండే వాతావరణం మీ వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. చెడు ప్రదేశాల్లో నివసించే ప్రజలు కూడా అక్కడి చెడుల నుంచి తమను తాము దూరంగా ఉంచుకోలేరు. మీరు వారితో కలిసి ఉంటే మీ ఆలోచన కూడా వారిలాగే చెడుగా మారి వెనుకబడిపోయేలా చేస్తుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండటమే మంచిది.

చెడ్డ దృష్టి ఉన్న వ్యక్తి.. చెడు చేసేందుకే ఇష్టపడతాడు. అందుకే సమాజంలో, మీ చుట్టూ ఉన్నా మిమ్మల్ని ప్రభావితం చేసేందుకే ఇష్టపడతాడు. అలాంటి వారితో కలిసి జీవించే వారికి అపవాదు కూడా వస్తుంది. అంతే కాకుండా మీ ఇంటికి వస్తే ఇంట్లో వాళ్లను కూడా తప్పుగా చూస్తారు.

చాకచక్యం లేని వ్యక్తి ఎవరితోనైనా మాట్లాడటానికి, చెప్పడానికి వెనుకాడడు. మెల్లమెల్లగా అతని సొంతం అనేది కూడా అతని నుంచి దూరం కావడం మొదలవుతుంది. అలాంటి వారితో కలిసి జీవించడం వల్ల మీ ప్రవర్తన చెడుగా, ప్రతికూలంగా మారుతుంది.




