- Telugu News Photo Gallery Business photos Withdraw pf money immediately after changing job may loose benefits here is the detail
EPFO Rules: ఉద్యోగం మానేసిన వెంటనే పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేశారా.? ఈ ప్రయోజనాలను కోల్పోయినట్లే!
అటు ఎంప్లాయర్.. ఇటు ఎంప్లాయ్.. ఇద్దరి వాటా డబ్బులు ఈపీఎఫ్ ఖాతాలో ప్రతీ నెలా జమ అవుతూ ఉంటాయి. ఇక ఈ పీఎఫ్ డబ్బును కొంతమంది...
Updated on: Jul 06, 2021 | 2:05 PM

అటు ఎంప్లాయర్.. ఇటు ఎంప్లాయ్.. ఇద్దరి వాటా డబ్బులు ఈపీఎఫ్ ఖాతాలో ప్రతీ నెలా జమ అవుతూ ఉంటాయి. ఇక ఈ పీఎఫ్ డబ్బును కొంతమంది ఉద్యోగస్తులు తమ ఉద్యోగాన్ని మారిన వెంటనే ఈపీఎఫ్ ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించుకుంటారు. మీరు ఉద్యోగం మారిన తర్వాత పీఎఫ్ ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేయడం సరైనదేనా.? లేదా ఆ ఫండ్‌ను వేరే పీఎఫ్ అకౌంట్‌కు బదిలీ చేయొచ్చా.? అనే విషయాలు తెలుసుకుందాం.

ఐదేళ్ళు దాటకుండానే మీరు మీ పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును విత్ డ్రా చేసుకుంటే.. ఆ మొత్తంపై పన్ను బెనిఫిట్ ఉండదు. ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ కింద ఈఎఫ్‌పీకి మినహాయింపు ఉంది. ఐదేళ్లలోపు డబ్బును ఉపసంహరించుకుంటే.. ఈ ప్రయోజనం వర్తించదు. అదే సమయంలో, మీరు ఒక ఈపీఎఫ్ ఖాతా నుండి మరొక ఈపీఎఫ్ ఖాతాకు డబ్బును బదిలీ చేస్తే, అప్పుడు మీకు పన్ను ప్రయోజనం అందుబాటులో ఉంటుం

ఈపీఎస్ సభ్యులు 10 సంవత్సరాల కాలం వరకు డబ్బును జమ చేస్తే.. 58 సంవత్సరాల వయస్సు తర్వాత వారికి పెన్షన్ లభిస్తుంది. అలాగే ఒక వ్యక్తి 58 ఏళ్ళకు ముందే పదవీ విరమణ చేసి, ఈపీఎస్‌లో 10 సంవత్సరాల పాటు డబ్బును జమ చేస్తుంటే.. అతనికి కూడా పెన్షన్ లభిస్తుంది.

మీ జీతం నుంచి ప్రావిడెంట్ ఫండ్ రూపంలో కట్ అయిన అమౌంట్.. రెండు ఖాతాల్లోకి జమ అవుతుంది. ఇందులో మొదటిది ప్రావిడెంట్ ఫండ్ అంటే ఈపీఎఫ్.. రెండోది పెన్షన్ ఫండ్ అంటే ఈపీఎస్. ఈపీఎస్‌లోకి 8.33 శాతం జమ అయితే.. ఈపీఎఫ్‌లో 3.67 శాతం జమ అవుతుంది.

ఈపీఎఫ్, పీఎఫ్ ఖాతాదారులు తప్పనిసరిగా తమ ఈపీఎఫ్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేసుకోవాలని ఈపీఎఫ్‌ఓ స్పష్టం చేసింది. ఒకవేళ ఆధార్ లింక్ చేయకపోతే, ఈపీఎఫ్ ఖాతాల్లోకి డబ్బును జమ చేయడంలో సంస్థలకు ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపింది. EPF ఖాతాల కోసం ఎంప్లాయర్ ECR (ఎలక్ట్రానిక్ చలాన్-కమ్ రిటర్న్) దాఖలు చేయడానికి EPFO అనుమతించదు.




