- Telugu News Photo Gallery Business photos UIDAI urges to complete mandatory aadhaar biometric update for children aged 7 and above
Aadhaar: మీ పిల్లల ఆధార్‌ను అప్‌డేట్ చేయలేదా? ఈ ప్రయోజనాలు కోల్పోయినట్లే..
ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు వారి ఫోటో, పేరు, పుట్టిన తేదీ, చిరునామాను అందించడం ద్వారా ఆధార్ కోసం నమోదు చేసుకోవాలి. ప్రస్తుతం వారి వేలిముద్రలు లేదా ఐరిస్ బయోమెట్రిక్స్ ఆధార్‌లో చేర్చలేదు. అయితే, బిడ్డకు
Updated on: Jul 18, 2025 | 7:00 AM

Aadhaar Card: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఏడు సంవత్సరాల వయస్సు నిండిన పిల్లలు తమ ఆధార్‌ను అప్‌డేట్ చేయడం తప్పనిసరి చేసింది. వారు అప్‌డేట్ చేయకపోతే తమ ప్రయోజనాలను కోల్పోతారని కూడా హెచ్చరించింది. అందువల్ల ఆధార్ సేవా కేంద్రాల ద్వారా ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవాలని UIDAI స్పష్టం చేసింది.

ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు వారి ఫోటో, పేరు, పుట్టిన తేదీ, చిరునామాను అందించడం ద్వారా ఆధార్ కోసం నమోదు చేసుకోవాలి. ప్రస్తుతం వారి వేలిముద్రలు లేదా ఐరిస్ బయోమెట్రిక్స్ ఆధార్‌లో చేర్చలేదు. అయితే, బిడ్డకు ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత వారి వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌లు, ఆధార్‌లో ఫోటోను అప్‌డేట్ చేయడం తప్పనిసరి.

ఐదు నుంచి ఏడు సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు బయోమెట్రిక్ అప్‌డేట్ ఉచితంగా చేయవచ్చు. ఏడు సంవత్సరాల తర్వాత పిల్లలకు రూ.100 రుసుము వసూలు చేస్తారు. పిల్లవాడు 7 సంవత్సరాలు పూర్తి చేసి బయోమెట్రిక్ అప్‌డేట్ పూర్తి చేయకపోతే, ఆధార్ చెల్లదు.

పాఠశాల అడ్మిషన్, ప్రవేశ పరీక్షల రిజిస్ట్రేషన్, స్కాలర్‌షిప్‌లు మరియు ఇతర ప్రయోజనాల కోసం అప్‌డేట్ చేసిన బయోమెట్రిక్ సమాచారంతో చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డులు మాత్రమే పరిగణిస్తారు.

వారు ప్రయోజనాలు కోల్పోకూడదని అనుకుంటే తల్లిదండ్రులు తమ పిల్లల ఆధార్‌ను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని, ప్రయోజనాలను కోల్పోవద్దని UIDAI సూచించింది.




