హోండా ఎలివేట్.. ఈ కారు సెప్టెంబర్ 4న ఎనిమిది కాంపాక్ట్ ఎస్‌యూవీగా విడుదల కానుంది. ఇది మారుతి గ్రాండ్ విటారా, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టయోటా హైర్డర్, ఎంజీ ఆస్టర్, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి పెద్ద కంపెనీలతో పోటీపడుతుంది. దీనిలో 1.5-లీటర్ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 121పీఎస్, 145ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. దీని ధర రూ. 11 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, అడాస్ (అధునాతన డ్రైవర్ సహాయ వ్యవస్థ) ఉన్నాయి.