AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best 6 SUV’s: 8 లక్షలలోపు అదిరిపోయే ఎస్‌యూవీలు ఇవే.. ఇక రోడ్లపై రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లాల్సిందే..!

సొంత కారు అనే భారతదేశంలో ఉండే ప్రతి మధ్యతరగతి కుటుంబం కల. కుటుంబ సమేతంగా హ్యాపీగా బయటకు వెళ్లి షికార్లు చేయాలని కోరుకుంటూ ఉంటారు. అయితే వాటి ధరలను చూసి కాస్త వెనకడుగు వేస్తారు. ఇటీవల కాలంలో కార్ల ధరలు వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం రూ.8 లక్షల లోపు అందుబాటులో ఉండే ఎస్‌యూవీల గురించి తెలుసుకుందాం.

Nikhil
|

Updated on: Jul 31, 2023 | 9:00 AM

Share
టాటా పంచ్‌ కార్‌ రూ.5,59,000 ధర నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ కార్‌ కేవలం పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే వస్తుంది. అలాగే ఇంజిన్‌ కెపాసిటీ 1199 సీసీగా ఉంటుంది. ఈ కారు కూడా మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. వేరియంట్, ఇంధన రకాన్ని ఈ కారు లీటర్‌కు 20.09 కిలో మీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. అలాగే ఈ కారులో కూడా ఐదుగురు హ్యాపీగా ప్రయాణించవచ్చు.

1 / 6
టాటా నెక్సాన్‌ రూ.7,99,900కు అందుబాటులో ఉంటుంది.  డీజిల్ ఇంజిన్, పెట్రోల్ ఇంజిన్ వేరియంట్స్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. డీజిల్ ఇంజిన్ 1497 సీసీ, పెట్రోల్ ఇంజిన్ 1199 సీసీతో పని చేస్తుంది. ఈ కారు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉంది. వేరియంట్, ఇంధన రకాన్ని బట్టి నెక్సాన్ మైలేజ్ 24.07 కిలో మీటర్ల వరకూ ఇస్తుంది. ఈ కారులో ఐదుగురు ప్రయాణించవచ్చు.

2 / 6
ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన కియా కంపెనీకు చెందిన సోనెట్‌  కారు రూ.7,79000కు అందుబాటులో ఉంటుంది. ఈ కార్‌ 1 డీజిల్ ఇంజిన్, 2 పెట్రోల్ ఇంజిన్స్‌తో అందుబాటులో ఉంటాయి. డీజిల్ ఇంజిన్ 1493 సీసీ, పెట్రోల్ ఇంజన్ 1197 సీసీ, 998 సీసీ ఉంటుంది. ఇది ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉంది. ఈ కారు లీటర్‌కు 18.4 కిలో మీటర్ల మైలేజ్‌ ఇస్తుంది. ఈ కారులో ఐదుగురితో ప్రయాణించవచ్చు.

3 / 6
రూ.5,99,900కు అందుబాటులో ఉండే నిస్సాన్‌ మెగ్నైట్‌ కారు ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తుంది. ఈ కార్‌ 999సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. అలాగే లీటర్‌కు 20 కిలో మీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. అలాగే ఈ కార్‌ మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.

4 / 6
హ్యూందాయ్‌ వెన్యూ కార్‌ రూ.7,76,900కు కొనుగోలుకు సిద్ధంగా ఉంటుంది. హ్యుందాయ్ వెన్యూ కూడా 1 డీజిల్ ఇంజిన్, 2 పెట్రోల్ ఇంజిన్‌తో వస్తాయి. డీజిల్ ఇంజన్ 1493 సీసీ, పెట్రోల్ ఇంజిన్ 1197 సీసీ, 998 సీసీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ కారు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. అలాగే ఈ కార్‌ 5 సీటింగ్‌ కెపాసిటీతో ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తుంది.

5 / 6
రూ.5,99,999 ధరలో లభ్యమయ్యే హ్యుందాయ​ ఎక్స్టర్‌ కారు అధునాతన ఫీచర్లతో ఆకర్షణీయంగా ఉంటుంది. హ్యుందాయ్‌ ఎక్స్టర్‌ పెట్రోల్ ఇంజిన్, సీఎన్‌జీ ఇంజిన్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ కారు ఇంజిన్ 1197 సీసీతో వస్తుంది. అలాగే సీఎన్‌జీ ఇంజిన్ 1197 సీసీతో వస్తుంది. ఈ కారులో కూడా ఐదుగురు ప్రయాణించవచ్చు. అలాగే ఈ కారు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. అలాగే ఈ కారు లీటర్‌కు 19.2 కిలో మీటర్ల మైలేజ్‌ ఇస్తుంది.

6 / 6