New Cars: ముహూర్తం ఫిక్స్.. మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న కొత్త కార్ల లిస్ట్ ఇదే..

పండగల సీజన్ వచ్చేసింది. వినాయక చవితికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాడవాడలా చవితి పందిళ్ల సందడి మొదలైంది. బొజ్జ గణపయ్యను పూజించడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. వినాయక చవితి అవ్వగానే దసరా, దీపావళీ రానున్నాయి. పండగల నేపథ్యంలో మార్కెట్ కళకళలాడుతోంది. అన్నిచోట్లా కొనుగోలుదారులు కిటకిటలాడుతున్నారు. పండగల సందర్భంగా చాలామంది కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా కార్ల అమ్మకాలు ఈ సీజన్ లో పెరుగుతాయి. ఈ నేపథ్యంలో కొనుగోలుదారుల కోసం ప్రముఖ కార్ల కంపెనీలు కొత్త మోడళ్లకు మార్కెట్ లో విడుదల చేయానికి ప్రణాళిక రూపొందించాయి. సెప్టెంబర్ నెలలో విడులవుతున్న టాటా కర్వ్ ఐసీఈ, మెర్సిడెస్-మేబ్యాక్ ఇక్యూఎస్, ఎంజీ విండ్సర్ ఈవీ, టాటా నెక్సాన్ సీఎన్‌జీ, మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ తదితర వాటి ప్రత్యేకతలను తెలుసుకుందాం.

Madhu

|

Updated on: Sep 03, 2024 | 1:47 PM

న్యూ-జెన్ మారుతి సుజుకి డిజైర్.. మారుతి సుజుకి డిజైర్ సెడాన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. కొత్త డిజైన్, 1.2-లీటర్ మూడు-సిలిండర్ ఇంజిన్, మాన్యువల్, ఏఎంటీ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో లభిస్తుంది. కొత్త డిజైర్ సీఎన్ జీ వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.

1 / 6
మెర్సిడెస్ - మేబ్యాక్ ఇక్యూఎస్.. ఈ ఎస్యూవీని సెప్టెంబర్ 5న విడుదల చేయనున్నారు. లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో దీనికి అత్యంత ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. చైనాలో మొదటిసారిగా దీన్ని ఆవిష్కరించారు. డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్, క్రోమ్ యాక్సెంటెడ్ గ్రిల్, పెద్ద అల్లాయ్ వీల్స్‌ తో ఆకట్టుకుంటోంది. 108.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ కారణంగా ఒక ఛార్జిపై సుమారు 600 కిలోమీటర్లు ప్రయాణం సాగించవచ్చు. దీనిలో డ్యూయల్ మోటార్లు 658 బీహెచ్పీ, 950 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

2 / 6
ఎంజీ విండర్స్ ఈవీ.. జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా కంపెనీ తన ఎంజీ విండర్స్ ఈవీని సెప్టెంబర్ 11న ఆవిష్కరించనుంది. దీని ద్వారా తన ఈవీల పోర్ట్ పోలియోను విస్తరించడానికి సిద్ధమైంది. విండ్సర్ ఈవీలో విశాలమైన క్యాబిన్‌, పనోరమిక్ సన్‌రూఫ్, ఎల్ఈడీ లైటింగ్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ తదితర ప్రత్యేకతలున్నాయి. వెనుక సీట్లలో రిక్లైనింగ్ ఫంక్షన్‌ కారణంగా ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 460 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. ఈ ఈవీ ధర రూ.17 నుంచి 18 లక్షల (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

3 / 6
హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్.. అల్కాజర్ ఎస్ యూవీ మొదటి మేజర్ అప్ డేట్ ను ఆవిష్కరించడానికి హ్యుందాయ్ కంపెనీ సన్నాహాలు చేస్తోంది. దీన్ని సెప్టెంబర్ 9న విడుదల చేస్తుందని సమాచారం. అల్కాజర్ ఎస్ యూవీలో అనేక ప్రత్యేకతలు ఉంటాయి. రిఫ్రెష్డ్ డిజైన్, అప్హోల్స్టరీతో రీమాజిన్ చేసిన ఇంటీరియర్, ఒక జత పెద్ద స్క్రీన్లు తదితర ఫీచర్లు ఉన్నాయి. సిస్టమ్ (అడాస్),1.5 లీటర్ టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో అందుబాటులోకి రానుంది.

4 / 6
టాటా నెక్సాన్ సీఎన్జీ.. టాటా నెక్సాన్ సీఎస్జీ కూడా సెప్టెంబర్ లోనే విడుదల కానుంది. ఈ ఏడాది ప్రారంభంలో టాటా నెక్సాన్ సీఎన్ జీని ప్రదర్శనకు ఉంచారు. దీనిలో డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ కారణంగా ఇంధన సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, సీఎన్ జీ పవర్‌ట్రెయిన్ ఎంపికలను అందించే మొదటి మోడల్‌ అని చెప్పవచ్చు.

5 / 6
టాటా కర్వ్ ఐసీఈ.. టాటా నుంచి కర్వ్ ఎస్యూవీ కూపే ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కారు ఐసీఈ (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) వెర్షన్ ను సెప్టెంబర్ 2న విడుదల చేసింది. 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో లభిస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి.

6 / 6
Follow us