- Telugu News Photo Gallery Business photos Long Term Health Insurance policies can give great benefits know about them in detail
Health Insurance: దీర్ఘకాలిక ఆరోగ్య బీమా కవరేజీని ఎంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?
తమ దీర్ఘకాలిక ప్రణాళికల (మల్టీ-ఇయర్ ప్లాన్)ల కోసం డిస్కౌంట్ అందించడానికి బీమా కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఇవి తమ మల్టీ ఇయర్ ప్లాన్ల పై ఇస్తున్న రాయితీలు అందుకోవడం ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ప్రయాజనకారిగా ఉంటుంది.
Updated on: Aug 14, 2021 | 4:35 PM

జూలై 2021 నాటికి, కోవిడ్ -19 వైరస్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 మిలియన్ల మందికి సోకి 4 మిలియన్లకు పైగా ప్రాణాలు తీసింది. ఇది ఆరోగ్య బీమా ప్రాముఖ్యతను అందరికీ మరింతగా నొక్కి చెబుతోంది.

సమర్థవంతమైన ఆరోగ్య పథకం కోసం పెరుగుతున్న అవసరంతో, దీర్ఘకాలిక ఆరోగ్య బీమా వెలుగులోకి వచ్చింది. సాధారణ ప్రణాళికల్లా కాకుండా, దీర్ఘకాలిక కవర్ అనేక అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.

దీర్ఘకాలిక ఆరోగ్య బీమా అనేది ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని కాపాడటానికి, ఆర్ధికంగా సంరక్షించడానికి ఉద్దేశించింది. ఇది 2-3 సంవత్సరాల కాలానికి అందిస్తారు. దీనివలన వార్షిక పునరుద్ధరణ సమయం, ఖర్చు ఆదా అవుతుంది.

అటువంటి ప్లాన్‌ల ప్రీమియం సాధారణంగా ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని బీమా సంస్థలు వాయిదాలలో చెల్లించే సౌలభ్యాన్ని అందిస్తాయి. మీరు నిర్ణీత వ్యవధిలో ప్రీమియం చెల్లించేటప్పుడు దీర్ఘకాలిక ప్రణాళికల ప్రయోజనాలను ఆస్వాదించడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది.

మల్టీ-ఇయర్ ప్లాన్ కోసం డిస్కౌంట్ అందించడం పట్ల బీమా సంస్థలు సంతోషంగా ఉన్నాయి. ఈ ప్రణాళికలలో ఏటా నో-క్లెయిమ్ ప్రయోజనం జోడిస్తారు. దీనివలన అదనపు లాభం దొరుకుతుంది.

దీర్ఘకాలిక ప్రణాళికల కాల వ్యవధి కనీసం 2 సంవత్సరాలు కాబట్టి, వార్షిక పునరుద్ధరణల కోసం ఇది మీకు పనిని ఆదా చేస్తుంది. పాలసీ సజీవంగా ఉండే వరకు మీరు ఏదైనా ఆరోగ్య సంరక్షణ వ్యయానికి వ్యతిరేకంగా ఆర్థికంగా సురక్షితంగా ఉండొచ్చు.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80డి ప్రకారం, పాలసీ కోసం చెల్లించిన ప్రీమియానికి వ్యతిరేకంగా మీరు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంలో తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు. ఒకేసారి ప్రీమియం చెల్లిస్తే, ఒకే సంవత్సరంలో ఎక్కువ మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు.

మీరు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే, మీ కోసం, జీవిత భాగస్వామి, పిల్లల కోసం రూ. 25,000 వరకు తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు. మీరు మీ సీనియర్ సిటిజన్ తల్లిదండ్రులను కూడా కవర్ చేస్తే రూ. 50,000 వరకు అదనపు తగ్గింపు క్లెయిమ్ చేయవచ్చు. ఇలా మొత్తం రూ .75,000 తగ్గింపు దొరుకుతుంది.

మీరు దీర్ఘకాలిక ఆరోగ్య కవరేజీని ఎంచుకుంటే, బీమా సంస్థ మీకు మొదటి సంవత్సరం నుండే ఉన్న అనారోగ్యాలను కవర్ చేసే అవకాశాన్ని ఇస్తుంది. అధిక ప్రీమియం అంగీకరించకపోతే చాలా పాలసీలు అటువంటి అనారోగ్యాలను కవర్ చేయవు.

ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ హాస్పిటలైజేషన్ ఖర్చులు, డాక్టర్ సంప్రదింపులు, అంబులెన్స్ సేవలు, ట్రీట్మెంట్ ఛార్జీలు, మొత్తం కుటుంబం కోసం ప్రీ-పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులను కవర్ చేస్తుంది

ఈ ప్లాన్‌లు రూ .1 నుండి రూ .1 కోటి వరకు బహుళ మొత్తం బీమా ఎంపికలతో వస్తాయి. మీరు వివిధ బీమా కంపెనీల నుండి ప్లాన్‌లను తెలుసుకోవచ్చు. దీనిద్వారా స్పెక్ట్రం అంతటా రేట్లను పోల్చిన తర్వాత ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు.



