Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upcoming Electric Cars: మధ్య తరగతికి అందుబాటులోని బెస్ట్ ఎలక్ట్రిక్‌ కార్లు ఇవే.. రేంజ్‌, ఫీచర్లు మాత్రం టాప్‌క్లాస్‌..

మనదేశంలో ఎలక్ట్రిక్‌ ఎరా ప్రారంభమైంది. పర్యావరణ హితమైన విద్యుత్‌శ్రేణి వాహనాల కొనుగోళ్లు ఊపందుకొంటున్నాయి. కంపెనీలు కూడా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఉత్తమ మోడళ్లను అందిస్తున్నాయి. అన్ని వర్గాల వారికి అందుబాటు ధరల్లో వీటిని తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ కార్ల రేట్లు కాస్త ఎక్కువగానే ఉంటున్నాయి. ధనిక వర్గాల వారికే అందుబాటులో ఉంటున్నాయి. అయితే కంపెనీలు దీనిపైనే ఫోకస్‌ పెట్టాయి. మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఎలక్ట్రిక కార్లను రూపొందిస్తున్నాయి. వాటిల్లో టాటా, మారుతి సుజుకి, హ్యూందాయ్‌, కియా వంటి దిగ్గజ కంపెనీలకు చెందిన కార్లు కూడా ఉన్నాయి. త్వరలో లాంచింగ్‌ కు సిద్ధమవుతున్న ఆ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Madhu

|

Updated on: Jun 09, 2023 | 3:23 PM

టాటా పంచ్‌ ఈవీ.. ఈ కారులో 30.2kwh సామర్థ్యంతో కూడిన లిథియం అయాన్‌ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ సింగిల్‌ చార్జ్‌ పై 300కిలోమీటర్లకు పైగా రేంజ్‌ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. సగటున 200 నుంచి 250 కిలోమీటర్లు రేంజ్‌ అయితే తప్పనిసరిగా అన్ని కార్లలో ఉండే అవకాశం ఉంది. గరిష్టంగా 100ఎన్‌ఎం టార్క్‌ ను ఉత్పత్తి చేసే పర్మనెంట్‌ మాగ్నెట్‌ సింక్రోనస్‌ మోటార్‌ దీనిలో ఉంటుంది. దీని ధర రూ. 10లక్షల నుంచి రూ. 12లక్షల వరకూ ఉండే అవకాశం ఉంది. 2023 ఆఖరుకు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

1 / 6
మహీంద్రా బీఈ05.. ఈకారు ధర రూ. 12లక్షల నుంచి రూ.16లక్షల వరకూ ఉంటుంది. ఇది ఇన్‌గ్లో కాన్సెప్ట్‌ ఆధారంగా తయారైంది. దీనిలో 60kwh, 80kwh బ్యాటరీ ప్యాక్స్‌ ఉంటాయి. ఇవి సింగిల్‌ చార్జ్‌ పై 450 కిలోమీటర్లకు పైగా మైలేజీ ఇస్తుంది. ఈ కారును 2025 అక్టోబర్‌ లో లాంచ్‌ అవకాశం ఉంది.

2 / 6
మారుతి సుజుకీ వ్యాగన్‌ ఆర్‌ ఎలక్ట్రిక్‌.. పెట్రోల్‌ వేరియంట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ కారును ఎలక్ట్రిక్‌ వేరియంట్లో లాంచ్‌ చేసేందుకు మారుతి సుజుకి సిద్ధమైంది. దీని ధర రూ. 10 నుంచి 14లక్షల మధ్య ఉంటుంది. 2025 నాటికి వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. ఈ కారులో 50kw సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్‌ చార్జ్‌ పై 130 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుంది.

3 / 6
టాటా నానో ఈవీ.. సామాన్యుల కలల కారుగా నిలిచిన టాటా నానో ఎలక్ట్రిక్‌ వేరియంట్‌ కారు తర్వలో అందుబాటులోకి రానుంది. దీని ధర రూ. 5లక్షల నుంచి 8 లక్షల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది లో స్పీడ్‌ మోడల్‌ రానుంది. గంటకు గరిష్టంగా 80కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.  17 kwh లిథియం అయాన్‌ బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్‌ చార్జ్‌పై 120 నుంచి 140 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుంది. 2024లో ఈ కారు లాంచ్‌ అ‍య్యే అవకాశం ఉంది.

4 / 6
హ్యూందాయ్‌ వెన్యూ ఎలక్ట్రిక్‌.. ఈ కారు ధర రూ. 12లక్షల నుంచి 15లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.దీనిలో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. లుక్‌ కూడా క్లాసీగా ఉంది. సేఫ్టీకి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ తో పాటు వెహికల్‌ స్టేబిలిటీ మేనేజ్‌మెంట్‌, ఎలక్ట్రానిక్‌ స్టేబిలిటి కంట్రోల్‌ ఫీచర్లు ఉన్నాయి. దీనిలో బ్యాటరీ సింగిల్‌ చార్జ్‌ పై 300 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. 2024 చివరికి ఇది వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

5 / 6
కియా సోల్‌ ఈవీ.. ఈ కారు ధర రూ. 10లక్షల నుంచి రూ. 12లక్షల వరకూ ఉంటుంది. దీనిలో 64kwh సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్‌ చార్జ్‌ పై 280కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుంది. 10.25 అంగుళాల నావిగేషన్‌ టచ్‌స్ర్కీన్‌ ఉంటుంది. ఈ కారు 2027 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

6 / 6
Follow us