- Telugu News Photo Gallery Business photos Get 4 percent cashback on fuel purchase with uni carbon credit card union bank of india
Cashback Offer: మీకు బైక్, కారు ఉందా..? అయితే పెట్రోల్ బంకుల్లో మీకో అదిరిపోయే ఆఫర్..
మీకు బైక్, స్కూటర్ ఉందా..? ఇవి కాకపోతే కారు ఉందా..? అయితే ఇలాంటి వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే ఆఫర్ ఇస్తోంది. పెట్రోల్, డీజిల్...
Updated on: Mar 29, 2021 | 12:44 PM

మీకు బైక్, స్కూటర్ ఉందా..? ఇవి కాకపోతే కారు ఉందా..? అయితే ఇలాంటి వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే ఆఫర్ ఇస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు అందిస్తోంది. దీని వల్ల చాలా బెనిఫిట్స్ పొందవచ్చని చెబుతున్నారు బ్యాంకు అధికారులు.

యూనియన్ బ్యాంక్ కస్టమర్ల కోసం యూని కార్బన్ క్రెడిట్ కార్డును అందుబాటులోకి తీసుకువచ్చింది.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ భాగస్వామ్యంతో ఈ క్రెడిట్ కార్డును తీసుకువచ్చింది. ఇది రూపే క్రెడిట్ కార్డు.

ఈ కార్డు తీసుకున్నవారు అదిరిపోయే బెనిఫిట్స్ పొందవచ్చు. కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డు అంటే రూ.5 వేల వరకు లావాదేవీలకు స్వైప్ చేయాల్సిన పని లేదు.

ట్యాప్ అండ్ పే సిస్టమ్ ద్వారా చెల్లింపులు నిర్వహించవచ్చు. అంతేకాదు ప్రత్యేకమైన రివార్డు పాయింట్లను కూడా అందిస్తోంది.యూని కార్బన్ క్రెడిట్ కార్డు ద్వారా హెచ్‌పీ పెట్రోల్ పంపుల్లో వాహనాలకు పెట్రోల్ లేదా డీజిల్ పోయించినట్లయితే 4 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది.

అలాగే వెల్‌కమ్ బోనస్ కింద రూ.300 లభిస్తాయి. ఇంకా పలు రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయని బ్యాంకు చెబుతోంది. మరిన్ని వివరాలు తెలుసుకోవాలని బ్యాంకు అధికారులను సంప్రదిస్తే చాలంటోంది.




