Ola EV Scooters: లేట్ అయినా లేటెస్ట్‌గా.. ఆ ఓలా స్కూటర్ల డెలివరీలు షురూ..!
ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఈవీ స్కూటర్ల డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా భారతదేశంలోని ప్రజలు పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు ఈవీ స్కూటర్లను ఆశ్రయిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని వారు ఈవీ స్కూటర్లన ఎక్కువగా ఇష్టపడడంతో వీటి డిమాండ్ అమాంతం పెరిగింది. భారతదేశంలో ఈవీ స్కూటర్ల అమ్మకాల్లో టాప్ ప్లేస్‌లో ఉన్న ఓలా కంపెనీ భారత మార్కెట్లో ఎస్1 జెన్-3 ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలను ప్రారంభించినట్లు ప్రకటించింది. స్కూటర్ల లాంచ్ ఈవెంట్లో ఫిబ్రవరిలో డెలివరీలు ప్రారంభమవుతాయని బ్రాండ్ తెలిపింది. కానీ ఆలస్యం అయింది. జనవరి 31న మొత్తం ఎనిమిది స్కూటర్లను లాంచ్ చేశారు. ఎస్1 ప్రో ప్లస్, ఎస్1 ప్రో, ఎస్1 ఎక్స్, ఎస్1ఎక్స్+ స్కూటర్లు వివిధ బ్యాటరీ ప్యాక్ పరిమాణాలతో అందుబాటులో ఉంటాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5