- Telugu News Photo Gallery Business photos Cyber expert asks flipkart users to reset passwords to avoid fraud
Flipkart: మీకు ఫ్లిప్‌కార్ట్‌లో అకౌంట్ ఉందా..? అయితే తస్మాత్ జాగ్రత్త.. హెచ్చరిస్తున్న నిపుణులు
Flipkart Account Password: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ లేనిది ఉండటం లేదు. చిన్న నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్‌లను వినియోగిస్తున్నారు. ..
Updated on: May 14, 2021 | 6:10 AM

Flipkart Account Password: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ లేనిది ఉండటం లేదు. చిన్న నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్‌లను వినియోగిస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌ల ద్వారా ఈ-కామర్స్ వెబ్‌సైట్ ద్వారా షాపింగ్ చేస్తున్నారు. అయితే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, బిగ్‌బాస్కెట్ లాంటి మొబైల్ యాప్‌లు వాడే వారు అనేక మంది ఉన్నారు.

యాప్‌లకే ఒకే యూజర్ నేమ్, పాస్‌వర్డ్ వాడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. అయితే మర్చిపోకుండా ఉండే పాస్‌వర్డ్ సులువుగా గుర్తుండాలన్న ఆలోచనే ఇందుకు కారణమని అంటున్నారు. కానీ ఇలా చేయడం వల్ల అనేక ఖాతాలు హ్యాకింగ్‌కు గురవుతున్నాయి. ఇటీవల ప్రముఖ ఈ కామర్స్ సంస్థ బిగ్ బాస్కెట్ నుంచి అనేక సంఖ్యలో యూజర్ల డేటా లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ డేటా డార్క్ నెట్‌లో దర్శనమివ్వడంతో అంతా షాక్ కు గురయ్యారు. సైబర్ నేరగాళ్లు ఈ డేటాను ఇతరులకు విక్రయిస్తున్నట్లు సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిగ్ బాస్కెట్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మూడు ఖాతాలకు ఒకే యూజర్ నేమ్, పాస్‌వర్డ్స్ ఉన్న వారి అకౌంట్లు సులువుగా హ్యాక్ అవుతున్నాయని నిపుణులు గుర్తించారు.

కాగా, అమెజాన్ ఎప్పుడు వాడే బ్రౌజర్ కాకుండా ఇతర బ్రౌజర్ నుంచి వాడితే ఓటీపీ నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో అమెజాన్ కస్టమర్లు హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం లేదు. కానీ ఫ్లిప్ కార్ట్ కస్టమర్లు మాత్రం సులువుగా హ్యాకర్ల దాడులకు గురవుతున్నట్లు గుర్తించారు. చాలా మంది హ్యాకర్లు ఇతరుల ఫ్లిప్ కార్ట్ ఖాతాలను వినియోగస్తున్నారని సైబర్ నిపుణుడు రాజశేఖర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

అయితే ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులు వెంటనే తమ పాస్‌వర్డ్‌ను మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు. లేకపోతే ఇబ్బందుల్లో పడే అవకాశాలున్నాయని సూచిస్తున్నారు. అలాగే ఫ్లిప్‌కార్ట్ సైతం కస్టమర్ల భద్రతపై దృష్టి సారించాలంటున్నారు. ఇక తమ కస్టమర్ల భద్రతకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు తమ ప్రత్యేక బృందం పని చేస్తోందని ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధులు చెబుతున్నారు.





























