Cars Launch: ఏప్రిల్‌లో మార్కెట్‌లో కార్ల జాతర.. ఫీచర్స్‌లో టాప్‌ అండ్‌ బెస్ట్‌ ఇవే..!

2024కు సంబంధించి మూడు నెలల్లోనే భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో అనేక ఆవిష్కరణలు, లాంచ్‌లు సర్వసాధారణమయ్యాయి. అయితే ప్రస్తుత ఏప్రిల్‌ నెలలో భారతీయ ఆటో మొబైల్ రంగా కార్ల జాతర జరగనుంది. సరికొత్త ఫీచర్స్‌తో సూపర్ స్మార్ట్ లుక్‌తో కార్లు మార్కెట్‌లోకి లాంచ్ కానున్నాయి. మహీంద్రా, టాటా మోటార్స్, టయోటా వంటి ప్రధాన వాహన తయారీదారులు తమ ఉత్పత్తులను ఏప్రిల్ నెలలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉన్న టాప్ కార్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

|

Updated on: Apr 04, 2024 | 3:47 PM

మహీంద్రా ఎక్స్‌యూవీ 300 ఈ నెలలోనే మార్కెట్‌లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మహీంద్రా ఎస్‌యూవీ కార్ల అమ్మకాలను తగ్గించింది.  ఎక్స్‌యూవీ 300 కొత్త గ్రిల్‌తో రీ-డిజైన్ చేసిన బంపర్లు, ఫ్రంట్ ఫేసియా ఆకర్షిస్తుంది. డీఆర్‌ఎల్‌లతో సిట్ ఎల్ఈడీ హెడ్‌లైట్లతో పాటు వెనుక వైపు కొత్త టెయిల్ గేట్ డిజైన్, రీ-డిజైన్ చేసిన బంపర్స్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. సైడ్లలో కొత్తగా డిజైన్ చేసిన 16-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఈ కారును మరింత ఆకట్టుకునేలా చేస్తాయి.

1 / 5
మారుతి సుజుకి ఫ్రాంక్స్‌కు సంబంధించిన రీ-బ్యాడ్జ్ వెర్షన్ అయిన టయోటా టైజర్ కూడా ఈ నెలలోనే రిలీజయ్యే అవకాశం ఉంది. టైజర్ భారతదేశంలో టీకేఎం ద్వారా రీ-బ్యాడ్జ్ చేసిన నాలుగో మారుతీ కారు. డిజైన్ పరంగా టయోటా బ్యాడ్జ్ ప్లేస్మెంట్ మినహా టైజర్ ఫ్రాంట్స్‌తో సమానంగా కనిపిస్తుంది. టైజర్ అదే ఫీచర్ జాబితాతో ఒకే విధమైన డాష్ బోర్డ్ డిజైన్‌తో వస్తుంది. టైజర్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. గేర్‌బాక్స్ ఎంపికలలో మాన్యువల్ లేదా ఏఎంటీ ఆటోమేటిక్ ఫీచర్స్‌తో వస్తుంది.

2 / 5
టాటా ఆల్టోజ్ రేసర్ కూడా ఈ నెలలోనే రిలీజ్ అవనుంది. ఈ కారును మొదట 2023 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు ఆల్టోజ్ రేసర్ రెండు ప్రధాన వేరియంట్లతో రానుందని నిపుణులు అంచనా వేస్తుంది. ఈ కారు ధర రూ. 9 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. ఆల్టోజ్ రేసర్ సాధారణ హ్యాచ్బ్యాక్ కంటే కొన్ని విజువల్ మెరుగుదలలను పొందుతుంది. ఈ కారులో స్పోర్టీ బంపర్లు, విభిన్న డిజైన్ ఆకట్టుకుంటుంది. ఆల్టోజ్ రేసర్ బ్లాక్ డ్యాష్ బోర్డ్ లేఅవుట్ కలర్ యాక్సెంట్లు ఆకట్టుకుంటాయి.

3 / 5
స్కోడా సూపర్బ్ ఏప్రిల్‌లోనే విడుదల కానుంది. కొత్త సూపర్బ్ సీబీయూ మార్గం ద్వారా భారతదేశంలో అమ్మకానికి సిద్ధంగా ఉండనుంది. ఈ కారు ధర రూ.40 లక్షలు ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ కారుకు సంబంధించిన ఇతర ఫీచర్ల వివరాలు ఇంకా తెలియలేదు.

4 / 5
టయోటా ఇన్నోవా హైక్రాస్ జిఎక్స్(ఓ) వేరియంట్‌ కూడా ఈ నెలలోనే రిలీజ్ అవుతుంది . ఈ కొత్త జీఎక్స్(ఓ) వేరియంట్ నాన్-హైబ్రిడ్ వెర్షన్ కోసం అందుబాటులో ఉంటుంది. గతంలో పెట్రోల్ హైక్రాస్ జీ-ఎస్ఎల్ఎఫ్, జీఎక్స్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ముఖ్యంగా జీఎక్స్(ఓ) పెట్రోల్ ఇన్నోవా హైక్రాస్ కోసం కొత్త టాప్-ఎండ్ వేరియంట్గా ఉంచబడుతుంది. కంపెనీ తమ వెబ్‌సైట్‌లో కొత్త జీఎక్స్(ఓ)ని జాబితా చేసింది. ఈ కొత్త ట్రిమ్ ధరను ప్రకటించకపోయినా కొత్త వేరియంట్ జీఎక్స్ ట్రిమ్ కంటే ఎక్కువగా ఉంటుంది

5 / 5
Follow us