- Telugu News Photo Gallery Business photos Attention SBI customers, deducted from your account as well? No need to go to the bank and ask, just know the whole reason
SBI: మీ ఎస్‌బీఐ ఖాతా నుంచి రూ. 147 కట్ అయ్యాయని టెన్షన్ పడుతున్నారా.. కారణం మాత్రం ఇదే..
దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ). ఇంతకూ ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ ల నుండి డబ్బు కట్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసుకుంటే..
Sanjay Kasula | Edited By: Anil kumar poka
Updated on: Mar 23, 2023 | 3:39 PM

మీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా నుంచి రూ. 206.50 కట్ అయ్యిందా..? ఈ మొత్తం మీ ఒక్కరికే జరిగిందని అనుకుంటే పొరపడినట్లే. ఇలా మీకు మాత్రమే కాదు.. చాలా మంది కస్టమర్లకు జరిగింది.

చాలా మంది స్టేట్ బ్యాంక్ ఖాతాదారులు తమ సేవింగ్స్ అకౌంట్ల నుండి డబ్బు కట్ అయ్యిందని సోషల్ మీడియా వేదికగా గగ్గోలు పెట్టారు. అయితే ఇలా డబ్బు కట్ అవ్వడం వెనుక కారణం ఉంది.

SBI net banking

వాస్తవానికి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ డెబిట్ / ATM కార్డ్‌లను కలిగి ఉన్న వినియోగదారుల పొదుపు ఖాతాల నుంచి రూ. 147, 206.5 లేదా రూ. 295 కట్ చేసింది.

మీరు కూడా SBI కస్టమర్ అయితే.. దాని బ్యాంకింగ్ సేవలను విస్తృతంగా ఉపయోగిస్తుంటే.. సంవత్సరానికి ఒకసారి మీ సేవింగ్స్ ఖాతా నుంచి కొంత మొత్తం మినహాయింపు ఇవ్వబడుతుంది. తరచుగా ఈ మినహాయింపుకు సంబంధించి బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం ప్రారంభిస్తారు ఖతాదారులు.

స్టేట్ బ్యాంక్ కూడా మీ సేవింగ్స్ ఖాతా నుంచి రూ. 206.5 కట్ చేసింది. కాబట్టి మీరు ఎలాంటి లావాదేవీలు చేయకుండానే బ్యాంక్ ఈ డబ్బును ఎందుకు డెబిట్ చేసిందని మనలో చాలా మంది ఆశ్చర్యపోతారు.

చాలా మంది ఎస్‌బిఐ ఖాతాదారుల ఖాతా నుంచి రూ. 147 నుంచి రూ. 295 డెబిట్ చేయబడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యువ, గోల్డ్, కాంబో లేదా మై కార్డ్ (ఇమేజ్) డెబిట్/ఎటిఎమ్ కార్డ్‌లను కలిగి ఉన్న కస్టమర్‌ల నుంచి వేర్వేరు ఛార్జీలను విధించడం వల్ల ఇది జరిగింది.

యువ డెబిట్ కార్డ్, గోల్డ్ డెబిట్ కార్డ్, కాంబో డెబిట్ కార్డ్ లేదా మై కార్డ్ (ఇమేజ్) డెబిట్/ATM కార్డ్‌తో సహా ఈ డెబిట్/ATM కార్డ్‌లలో దేనినైనా ఉపయోగించే వ్యక్తుల నుంచి SBI వార్షిక నిర్వహణ రుసుముగా రూ. 175 వసూలు చేస్తుంది.

SBI





























