- Telugu News Photo Gallery Business photos Amazing discounts on those Tata cars, Discounts up to Rs.40 thousand, Tata Car Offers details in telugu
Tata Car Offers: ఆ టాటా కార్లపై మతిపోయే డిస్కౌంట్లు… ఏకంగా రూ.40 వేల వరకూ తగ్గింపులు
టాటా మోటార్స్ ఏప్రిల్ 2024 నెలలో తన లైనప్‌లో వివిధ మోడళ్లపై గణనీయమైన తగ్గింపులు, ప్రమోషనల్ ఆఫర్‌లను ప్రవేశపెట్టింది. ఈ తగ్గింపులు కస్టమర్‌లను ఆకర్షించడం, పోటీతత్వ ఆటోమోటివ్ మార్కెట్‌లో అమ్మకాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ముఖ్యంగా తక్కువ ధరలో సొంత కారును కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ఆఫర్లు మేలు చేస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపత్యంలో టాటా మోటర్స్‌లో ప్రస్తుతం ఏయే కార్లపై ఆఫర్లను అందిస్తున్నారో? ఓ సారి తెలుసుకుందాం.
Updated on: Apr 13, 2024 | 4:45 PM

టాటా ఆల్ట్రోజ్ కారుపై రూ.35 వేల వరకూ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. ఎంటీ, డీజిల్, సీఎన్‌జీ, పెట్రోల్ డీసీఏ పెట్రోల్ వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉంటుంది. 1.2-లీటర్ పెట్రోల్, 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది.

టాటా నెక్సాన్ కారుపై రూ. 15 వేల వరకూ ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. ఈ కారు ధర రూ. 8.15 లక్షల నుంచి రూ. 15.80 లక్షల వరకూ ఉంటుంది. అలాగే ఈ కారు సీఎన్‌జీ వేరియంట్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో ఆధారంగా పని చేస్తుంది.

టాటా సఫారి ఎంవై 2023 స్టాక్‌లపై రూ. 1.25 లక్షల వరకు తగ్గింపు అందుబాటులో ఉంటుంది. టాప్-స్పెక్ ఏడీఎస్ అమర్చిన వేరియంట్లతో పాటు నాన్ ఏడీఏఎస్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ఫేస్‌లిఫ్టెడ్ మోడల్స్‌పై రూ. 70,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంటుంది.

టాటా టియాగో కారు రూ. 40,000 వరకు ప్రయోజనాలు అందిస్తున్నారు. టాటా టియాగో వేరియంట్లు ఎక్స్‌టీ, ఎక్స్‌టీ (ఓ), ఎక్స్ఎం వేరియంట్లపై తగ్గింపు అందుబాటులో ఉంటుంది. ఈ కారులు ధరలు రూ. 5.65 లక్షల నుంచి రూ. 8.90 లక్షల వరకూ ఉంటుంది.

టాటా టిగోర్‌పై కూడా రూ.40 వేల డిస్కౌంట్లు అందుబాటులో ఉంది. టాటా టిగోర్ ఎక్స్‌జెడ్ ప్లస్, ఎక్స్ఎం వేరియంట్లు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు 1.2-లీటర్, మూడు-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌లతో వస్తుంది.




